కో పైలట్ సైకో
జర్మన్ వింగ్స్ ప్రమాదంపై కొత్తకోణం
ప్యారిస్,మార్చి28(జనంసాక్షి): జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి కోపైలట్ సైకో కావడమే కారణమని మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై రోజుకో కథనం రావడంతో ఇప్పుడు దీనిపై లోతుగా విచారణ చేపట్టారు. కోపైలట్ వల్లనే ప్రమాదం జరిగిందని గుర్తించిన దర్యాప్తు బృందం ఇప్పుడు మరింత లోతుగా విచారణకు దిగింది. కోపైలట్ సైకో అని తేల్చారు. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో సైకో థెరపీ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. బ్లాక్‌బాక్స్ సంభాషణల ఆధారంగా విశ్లేషణల ఆధారంగా కొత్తకొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఎవరిదో ప్రేమ గొడవ ఏ మాత్రం సంబంధం లేని వందలాది మంది ప్రాణాల విూదకు తెచ్చింది. జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశ్య పూర్వకంగా చేసిందని తేలుస్తున్నారు. విమానాన్ని పర్వత శ్రేణుల్లోకి దూకుడుగా తీసుకెళ్ళి ప్రమాదం కలిగించారని ఇప్పటికే వెల్లడి అయినది. మొత్తంగా ఆ కో-పైలట్ ప్రేమ వాళ్ల కొంప ముంచింది. పిచ్చెక్కిన కోపైలట్ ఏకంగా 150 మంది ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో కూలిపోయిన విమానం ప్రమాదానికి ప్రధాన కారకుడు కో పైలటే కారణం అని నిర్ధారణ కావడంతో కారణాలను విశ్లేషిస్తున్నారు. దీని గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు ద్రిగ్బాంతి కలిగించేలా ఉన్నాయి. తాజాగా కూలిపోయిన జర్మన్ వింగ్స్ ‘ఎయిర్‌బస్ ఏ-320 విమాన ప్రమాదం గురించి వెలుగులోకి వస్తున్న అంశాలువిమాన ప్రయాణం ఎంత గాలిలో దీపమో అర్థం అవుతోంది. అయితే కో-పైలట్ ఒక మానసిక రోగి అని, పెళ్ళి చేసుకోవాలి అనుకున్న ప్రియురాలు రెండు వారాల కితం చెయ్యి ఇవ్వడంతో మానసిక వ్యధకు గురై, రోగం తిరగ బడటంతో ఈ దుస్సహసాహానికి పాల్పడ్డారని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. ప్రియురాలి విూద కోపంతో విమానాన్ని కూల్చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్నాడని ప్రముఖ జర్మనీ వార్తా పత్రిక ‘బిల్డ్’ వెల్లడించింది.బాత్‌రూమ్‌కు వెళ్లిన పైలట్ తిరిగి కాక్‌పిట్‌లోకి రాకుండా క్యాబిన్ డోర్‌ను లాక్ చేసి విమానాన్ని తలకిందులుగా తీసుకెళ్లి పర్వతాల్లో కో-పైలట్ లూబిడ్జ్ కూల్చేసినట్టు గురువారం ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన విషయం తెల్సిందే. ప్రియురాలు కాదన్నప్పటి నుండి సైకో థెరపీ కింద కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడని కుడా తెలుస్తున్నది. 28 ఏళ్ల లూబిడ్జ్ 2008లో పైలట్ శిక్షణ సందర్భంగా కొన్ని నెలలపాటు సెలవు తీసుకొని మానసిక జబ్బుకు సైకో థెరపి తీసుకున్న విషయం కూడా ప్రమాదం తరవాతనే వెలుగులోకి వచ్చింది. ముందే తెలుసుకుని వుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. విమాన ప్రమాద సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారుల బృందం నాలుగు గంటలపాటు మోంటబార్‌లోని కో-పైలట్ లూబిడ్జ్ ఫ్లాట్‌ను శోధించగా ప్రియురాలి వ్యాధికి మందులు తీసుకుంటున్న విషయం బయట పడింది. . లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరపున అమెరికాలోని ఆరిజోనాలో పైలట్ శిక్షణ పొందిన లూబిడ్జ్ ఏకంగా ఏడాది పాటు మానసిక వ్యాధికి సైకో థెరపీ తీసుకున్నాడని తెలిసింది. అయితే అన్ని పరీక్షలతోపాటు, మానసిక పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడయ్యాకే ఆయన్ని పైలట్ గా ఎంపిక చేశామని విమాన సంస్థ అధికారులు తెలుపుతున్నారు. లూబిడ్జ్ నివాసంలో దొరికిన పత్రాల ప్రకారం విమాన ప్రమాదం జరిగిన ముందు రోజు వరకు కూడా మానసిక వ్యాధికి కో-పైలట్ కౌన్సెలింగ్ తీసుకుంటూ వచ్చాడు. విమానం ఎక్కే సందర్భాల్లో కూడా డాక్టర్ సలహా తీసుకున్నాకే విమానాన్ని నడపాల్సి ఉంటుందని కూడా ఆయనకు వైద్యం చేస్తున్న సైకాలజిస్ట్ సూచించారు. అయితే కాక్‌పిట్ బయట నుండి సీక్రెట్ కోడ్ ఉపయోగించి తలుపు తీసే అవకాశం ఉన్నా పైలట్ అందుకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఒక వేళ తలుపు తీస్తే కో పైలట్ బలవంతంగా బయటకు నెట్టి వేసేసాడా ? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించడం లేదు. పోలీసులు ప్రమాద స్థలంలో అన్వేషిస్తున్న రెండో బ్లాక్ బాక్స్ దొరికితే మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాద ప్రాంతంలో శవాల ఆనవాళ్లు లేనంతగా చెల్లాచెదురుగా పడ్డాయి.