క్రౖెెస్తవ సన్యాసిని గ్యాంగ్‌రేప్ నిందితుల పట్టివేత
కోల్‌కతా,మార్చి26(జనంసాక్షి): కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్) గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మార్చి 13న నన్‌పైన్పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినప్పటికీ.. అధికారికంగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉందని సమాచారం. మరోవైపు ఈ కేసును సూమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ నాడియా జిల్లా గంగాపూర్ గ్రామంలోని స్కూల్లో దొంగతనానికి వచ్చిన ఏడుగురు దొంగలు ప్రతిఘటించిన 72 ఏళ్ల నన్‌పై అత్యాచారంచేసి దాదాపు పన్నెండు లక్షల రూపాయలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. స్థానిక రాణాఘాట్ ఆసుపత్రిలో కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయిన నన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.