ఖాట్మండు కకావికలం
2300కు పెరిగిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
ముమ్మరంగా సహాయచర్యలు
ఖాట్మండు చేరుకున్న భారత సహాయ బృందాలు
పది లక్షల డాలర్ల తక్షణసాయం ప్రకటించిన అమెరికా
నేపాల్‌కు సాయంగా కదిలిన పాక్, చైనా
కిక్కిరిసిన ఆసుపత్రులు.. నేలపైనే చికిత్సలు
ఖాట్మండు, ఏప్రిల్ 26 (జనంసాక్షి):భూకంపం నేపాల్‌ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య గంట
గంటకూ పెరుగుతోంది. భూప్రకంపనల వల్ల ఇప్పటివ రకు 2,300 మంది మరణించినట్టు పోలీసులు తెలిపా రు. 2వేలకు పైగా మృతదేహాలను వెలికితీశారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడ్డారు.శనివారం నేపాల్‌లో సంభంవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు
పై 7.9గా నమోదైన సంగతి తెలిసిందే. నేపాల్‌లోపురాతన కట్టడాలు, ఆలయాలు, ప్రభుత్వ భవ
నాలు, ఇళ్లు వేల సంఖ్యలో నేలమట్టమయ్యాయి. శనివా రం రాత్రంతా ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. నేపాల్ నుంచి 4 ప్రత్యేక విమానల ద్వారా 564 మంది భారతీయులను సురక్షితంగా తరలించారు. మరో పది విమానాలను నేపాల్‌కు పంపారు. భారత సహాయ బృందాలు, వాయుసేననేపాల్‌లో ఇప్పటికే సహాయ చర్యల్లో నిమగ్న
మైంది.సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.నేపాల్‌లో ఈ రోజు కూడా భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి ప్రజులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. భారత రాజధాని ఢిల్లీని కూడా భూప్రకంపనలు చుట్టుముట్టాయి. ప్రజలంతా భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారత మంతా కంపించిపోయింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో భూప్రకంపనలు వచ్చాయి.
నేపాల్‌కు సాయంగా కదిలిన పాక్, చైనా
ఇస్లామాబాద్: భారీ భూకంపం కారణంగా నష్టపోయిన నేపాల్‌ను ఆదుకునేందుకు పలు దేశాలు
ముందుకొస్తుండగా ఇందులో ముఖ్యంగా భారత్ ఇప్పటికే తన సహాయక చర్యలు ప్రారంభించగా పొరుగు దేశాలైనా చైనా, పాకిస్థాన్ కూడా తామూ సాయం చేస్తామంటూ తరలాయి. సీ-130 అనే
నాలుగు విమానాలలో వైద్య సదుపాయాలు, సహాయక బృందాలను, ఆహారా పదార్థాలను పాకిస్థాన్ పంపించనుంది.ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో వైద్య సిబ్బందిని, వైద్య పరికరాలను, పడకలను పాకిస్థాన్ పంపిస్తుంది. మరోపక్క, చైనా కూడా తమ దేశం నుంచి 62 మంది చైనా ఇంటర్నేషనల్ అండ్ రెస్క్యూ టీంను పంపించింది. శిథిలాల కింద మృతదేహాలను గుర్తించే స్నిప్పర్ డాగ్స్‌ను కూడా
ఆదివారం మధ్యాహ్నంలోగా పంపించనుంది.
నేపాల్, భారత్‌లో మళ్లీ భూ ప్రకంపనలు
నేపాల్ కేంద్రంగా ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల తీవ్రత ఉత్తర భారతదేశం వరకూ వ్యాపించింది. దేశరాజధాని దిల్లీతో పాటు ల్షానవూ, భువనేశ్వర్, పశ్చిమ్‌బంగ, గుడ్‌గావ్, నోయిడా, ్ణొహతి, డెహ్రాడూన్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. కాఠ్‌మాండూకు 80 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైనట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ, కోల్‌కతాలో మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నవారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దిల్లీ, కోల్‌కతాలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. తీవ్ర భూకంపం వచ్చిన తర్వాత ప్రకంపనలు రావడం సహజమేనని అధికారులు వెల్లడించారు.
పది లక్షల డాలర్ల తక్షణసాయం ప్రకటించిన అమెరికా
భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10 లక్షల డాలర్ల తక్షణసాయం ప్రకటించింది. పెను భూకంపంతో పాటు వరస ప్రకంపనాలతో వణికిపోతున్న నేపాల్‌ను ఆదుకోవడానికి పొరుగు దేశాలైన భారత్, చెయనాలు ఇప్పటికే పలు రకాల సహాయ చర్యలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 2,350కి చేరింది. గాయపడినవారు 6 వేలకు పైగా ఉన్నారు.
కాఠ్‌మాండూలో భారీ వర్షం
నిన్నటి పెనుభూకంపానికి అతలాకుతలమైన నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ పరిస్థితి నేడు పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్లయింది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇంతకుముందే హెచ్చరించింది. వర్షం సహాయ చర్యలకు పెను అవరోధంగా మారనుంది. ప్రకంపనాలకు జడిసి ఆరుబయట కాలం గడుపుతున్న వారికి ఆ వెసులుబాటు కూడా లేకుండా చేస్తోంది ఈ వాన.
కిక్కిరిసిన ఆసుపత్రులు.. నేలపైనే చికిత్సలు
ఎక్కడ విన్నా పిల్లలు, వృద్ధుల ఆర్తనాదాలు.. క్షతగాత్రులందరికీ ఆవరణలోనే చికిత్సలు.. తీవ్రంగా గాయపడినవారికి మాత్రమే పడకలు.. అవి కూడా పరిమిత సంఖ్యలో.. ఇవీ.. మొత్తంగా నేపాల్ దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నెలకొన్న హృదయవిదారక దృశ్యాలు! ఈ విపత్కర పరిస్థితిలో నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు అన్నివిధాలా శ్రమిస్తున్న భారత్ ఆదివారం నాటికి 43 టన్నుల అత్యవసర సామాగ్రిని ఖాట్మండుకు తరలించింది. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆహారం, వైద్య సామాగ్రిని తరలించారు. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా సహాయక బృందాలు నేపాల్ కు చేరుకుంటున్నాయి. అమెరికా, యురోపియన్ యూనియన్ నుంచి టీమ్స్ వస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ప్రకటించారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం.. దాదాపు 66 లక్షల మందిపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
నేపాల్ భూకంప మృతులకు పోప్ సంతాపం
వాటికన్ సిటీ: విధ్వంసకర నేపాల్ భూకంపంలో మృతి చెందిన ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ సంతాపం తెలిపారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారికి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆయన విదేశాంగ కార్యదర్శి పీట్రో పారోలిన్ ఈ మేరకు నేపాల్ కేథలిక్ మతాధికారులకు ఆదివారం టెలిగ్రాం పంపారు. నేపాల్ భూకంపంలో మృతి చెందిన ప్రజలకు పోప్ తీవ్ర సంతాపం తెలిపారని దానిలో పేర్కొన్నారు. అక్కడ ప్రజలకు సేవలందిస్తున్న పౌర సంఘాలు, అత్యవసర సిబ్బందిని ఆయన కొనియాడారని దానిలో తెలిపారు.
నేపాల్ వైద్య కళాశాలలో తెలంగాణ విద్యార్థులు
హైదరాబాద్: నేపాల్‌లోని భరత్‌పూర్ వైద్య కళాశాలలో 50 మంది తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు చదువుకొంటున్నారు. భూకంపం నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులతో మాట్లాడారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు అక్కడ ఉన్నట్లు తెలిసింది. వారిని కళాశాల యాజమాన్యం దేశ సరిహద్దువరకూ బస్సులో పంపుతోంది. అక్కడ్నించి విమానం లేదా రైలులో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని, విద్యార్థుల బాగోగులను చూడాలని గోర్షాపూర్ జిల్లా కలెక్టరును మంత్రి ఫోనులో కోరారు.
కాఠ్‌మాండూనుంచి కొందరిని బస్సుల్లో తరలిస్తాం: జైశంకర్
దిల్లీ: కాఠ్‌మాండూ నుంచి కొందరిని బస్సుల్లో తరలిస్తామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ తెలిపారు. రహదారులను పరిశీలించామని, బిహార్ నుంచి 35 బస్సులు పంపుతున్నామని ఆయన తెలిపారు. కాఠ్‌మాండూపైనే ఎక్కువ దృష్టిపెట్టామని ఆయన తెలిపారు. నిన్న 546 మందిని తీసుకొచ్చామని, ఇవాళ మరో 266 మందిని తీసుకొచ్చామని జైశంకర్ చెప్పారు.