ఖాళీ జాగల్లో పేదలకు ఇళ్లు

C

మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్‌

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): రాజధానిలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హమాలీ బస్తీలో బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ బస్తీని అమీర్‌ బస్తీగా మారుస్తామని అన్నారు. ఇక పూర్తిగా దెబ్బతిన్న సికింద్రాబాద్‌కు ఇక శస్త్రచికిత్స తప్ప మరోమార్గం లేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇక్కడ మందులతో పనిచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు.  స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం  మెట్టుగూడలో పర్యటించారు. అనంతరం మెట్టుగూడలో స్వచ్ఛ హైదరాబాద్‌పై మెంటర్స్‌, నోడల్‌ అధికారులతో సీఎం సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  తాను సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయి. సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి సర్జరీ చేయాల్సిదేనన్నారు. ఇక్కడ పేరకుపోయిన సమస్యలకు ఎవరినో నిందించేకంటే నిర్ణయాలు తీసుకుని బాగుచేయడం ఒక్కటే మంచిదన్నారు. నాలాలు కబ్జాకు గురయ్యాయని, మురికిలోనే ప్రజలు దారుణ పరిస్థితుల్లో నివిస్తున్నానని అన్నారు.  బస్తీల్లోని ప్రజల సమస్యలను సావధానంగా విన్నాని, సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.  హైదరాబాద్‌లో 77 నాలాలు 390 కిలోవిూటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. 5 నాలాలు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. ఈ నాళాలు కబ్జాకు గురికావడం వెనక ఎందరు మహానుభావులు ఉన్నారో అని సిఎం నిట్టూర్పు విడిచారు. ఈ దశలో ఇక సర్జరీ చేయడం ద్వారా కాలనీలను బాగు చేయాల్సి ఉందన్నారు. అవసరమైతే ఇక్కడి ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి తరలిస్తామని అన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఇండ్లలో చెత్త రోడ్లపై వేయకుండా దానిని విభజించి తరలించాల్సి ఉందన్నారు. చెత్త తరలింపునకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడున రిక్షా స్థానంలో  2 వేల ట్రాలీ ఆటోలతో సిటీలో చెత్త తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీనే ట్రాలీ ఆటోలు కొని బస్తీల్లోని పేద నిరుద్యోగుకుల ఇస్తే నిరుద్యోగ సమస్యా తీరుతుందన్నారు. తరలించిన. చెత్తతో కరెంట్‌ ఉత్పత్తికి, బయో ఫర్టిలైజర్‌  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో శానిటేషన్‌ను మరింత మెరుగు పర్చాల్సి ఉందన్నారు. ఇక ఇండ్ల నిర్మాణాల్లో మిగిలిన వ్యర్థాలతో సిటీ బయట ఉన్న మైనింగ్‌ గుంతలు పూడ్చాలి. హరితహారం కోసం బస్తీలన్ని సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.