గంగారం ,దాసుతండా లో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం

టేకులపల్లి, సెప్టెంబర్ 14( జనంసాక్షి ): టేకులపల్లి మండలంలోని గంగారం గ్రామపంచాయతీ, దాసుతండా గ్రామపంచాయతీ లలో అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం బుధవారం ఘనంగా నిర్వహించారు. తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 30 రోజులు పాటు పోషణ మాసా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గంగారం గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రం లో సర్పంచ్ పాయం సమ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొనగా సూపర్వైజర్ జి లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సౌందర్య ,శాంత, ధనలక్ష్మి, సుజాతల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా దాసు తండా గ్రామపంచాయతీలో అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ కే అనురాధ, అంగన్వాడి టీచర్లు మంగమ్మ ,జ్యోతి ,ఈశ్వరమ్మ ,రాంబాయి ,అశ్విని, ఆయా లక్ష్మి ల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసాలు చేశారు .ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు కే అనురాధ, జి లక్ష్మి లు మాట్లాడుతూ గర్భిణీలు, బిడ్డ ,తల్లి క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లులు సమయంలో పోషకాహారాన్ని తీసుకోవాలని అన్నారు. పుట్టిన తర్వాత బిడ్డకు తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదని, తల్లి పాల వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతి ఒక్క తల్లి మూర్రిపాలు పట్టించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో చిన్నారులను అలరించే విధంగా ఆకుకూరలు,కూరగాయలతో తయారుచేసిన వంటకాలు ఆకట్టుకున్నాయని వాటిని చూస్తే పిల్లలపై టీచర్స్ కి ఉన్న అంకిత భావం గొప్పదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తల