గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేయండి

1

హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది

హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి):

హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గణెళిశ్‌ నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం పూర్తయ్యాక వెంటనే శుభ్రం చేసే యంత్రాంగం ఉండాలని స్పష్టం చేసింది. అదే విధంగా గణెళిశ్‌ విగ్రహాల ఎత్తును నియంత్రించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో భవనాల క్రమబద్ధీకరణపై  కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఏ భవనాలను క్రమబద్ధీకరిస్తారో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించిన భవనాలను క్రమబద్ధీకరించడం సరికాదని అభిప్రాయపడింది. ప్రజోపయోగ స్థలాల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించడం సరికాదని వ్యాఖ్యానించిన హైకోర్టు… వేసవి సెలవుల తర్వాత పూర్తి స్థాయి విచారణ చేపడతామని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తుది నిర్ణయం తీసుకోవద్దని పునరుద్ఘాటించింది. అయితే క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన చేసుకోవచ్చని తెలిపింది.