గల్ఫ్‌బాధితులు – ఒక అధ్యయనం
(మంగళవారం తరువాయి భాగం)
నాంపెల్లి గోవర్ధన్ మాట్లాడుతూ సంపాయించుకోవచ్చు అని పోయిన పోకున్నా ఎల్లుతుండే. పోవడానికి లక్ష ముప్ఫయి వేలు ఖర్చు పెట్టి న. వెల్డింగ్ పని అని చెప్పి ఒంటెలు కాయపెట్టిండ్రు. పది ఒంటెలకు కాపలా ఉన్న. ఒంటె తప్పిపోతే కొట్టేటోళ్లు, ఎడారులల్ల ఒంటరిగా ఉన్నా దగ్గర సెల్‌ఫోన్ ఉంటే మాట్లాడుతున్ననని గుంజుకున్నరు. నరకం అనుభవించిన. ఎడారుల్లో కొమ్ములు పాములుంటాయి. అవికరిసినాక తొందరగా దవాఖానాకు పోతే తప్ప బతకం ఉండదు. చెబితే వినకపోతే శిక్షలు భయాంకరంగా ఉంటాయి. రూంల వేసి తాళం పెడతారు. కిటీకి ఈవల నీళ్ల క్యాన్ పెట్టి, అందులో గొట్టం వేసి, గొట్టం చివరి కొసను కిటికీ లోపలికి వేసి నీళ్లు తాగమని చెప్పి పోతరు. సౌదీ అరేబియాలో మూడు నెలలు గడిపివచ్చా. అప్పులపాలైన. ఇప్పుడు టైలర్‌గా జీవితం గడుపుతున్న అని చెప్పిండు. గాజులు మల్లేశం అనుభవం మరో రకంగా ఉంది. రెండు సంవత్సరాల వీసా మీద దుబాయికి పోయిండు. బోరింగ్ పని అని చెప్పి గొర్ల కాపలా కాయమన్నారు. పనిచేసే చోట మరొకరి తప్పిదం వల్ల ట్రక్కు రెండు కాళ్ల మీదకు ఎక్కిందట. ఇంటి నుంచి యాభై వేలు పంపితే స్వదేశానికి వచ్చిండు. ప్రస్తుతం భూమి, ఇల్లు లేదు. చెట్టు కింద బిచ్చగాళ్ల లెక్క బతుకుతున్నం అని అతని భార్య అంది.ఇంతటి భయంకర అనుభవాల్ని పొంది కూడా రెండోసారి పోవాలనుకునే వారు ఉన్నారు. అక్కడికి పోతే సుఖం ఏం లేదు. ఇక్కడ ఉండలేక, అప్పులోల్లకు ముఖం చూపించలేక మల్ల పోవాలనిపిస్తుంది. ఏజెంట్ మీద పైసలు ఉన్నాయి. పైసలకు బదులు మల్ల ఫ్రీగా పంపుత అంటున్నాడు. అందుకోసం పోవాలనిపిస్తుంది. అని తోకల భూమయ్య అన్నాడు. ఇక్కడి నుంచి వెళ్లిన పేద బిడ్డలకు అక్కడ పేదరికమే కనపడలే ట. ఒకవేళ ఎవరన్నా తక్కు వ స్థాయిలో ఉంటే, అక్కడి దణవంతులు వారికి కావాలిసినన్ని నోట్ల కట్టలు ఇస్తరని అ మాయకం గా అన్నారు. జరుగుత ుందని చెబుతున్న అభివృద్ధి అందని ప్రజలు వలసలు పోతు న్నారు. వలస వెళ్లిన ప్రజలు మోసపోత ున్నారు. మోసపోయిన వారు అప్పుల్లో కూరుకు పోతున్నారు. కూరుకుపోయిన వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. దేశం వెలుగుతుంది అనే వాళ్లు ఈ నీడల్ని పట్టించుకోవాలి.
– బీవీఎన్ స్వామి