గల్ఫ్‌ బాధితులు – ఒక అధ్యయనం

ఉన్న ఊళ్లో బతుకు తెరువు లేక, ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలసపోతున్న వారి కష్టాలనూ, దళారుల చేతుల్లో బలైపోతున& వారి పరిస్థితులనూ వివరిస్తున్నారు బివి ఎన్‌ స్వామి
వలసలు అనేక రకాలు, వ్యక్తి తన శ్రేయస్సు కోసం ఆలోచిం చడం సహజం. అందరుకోసం ఉన్న చోటు నుండి మరోచోటుకి తరలడం అనివార్యం. అలాంటి అనివార్యత రుద్రంగిఆ గ్రామస్తులకు కలిగిం ది.మరింత మెరుగైన జీవితం కోసం వెళ్లిన గ్రామస్తులు అప్పుల బారిన పడి నరక యాతన పడుతున్నారు. ఈ వ్యతిరేక ఫలితాల ఆధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు తెలిసినయి. కరీంనగర్‌ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రమంలో 2500 కుటుంబాలు ఉన్నవి. జనాభా 9969, ఓటర్లు 7055, భూమి విస్తిర్ణం 10,720 ఎకరాలు, పురుషుల్లో 90 శాతం మంది గల్ఫ్‌ దేశాల్లో ఏదో ఒక దేశం వెళ్లి వచ్చినవారే. ఇటీవలి కాలంలో ఏజెంట్ల మోసాల వల్ల గల్ఫ్‌ నుండి ఉత్త చేతులతో వచ్చినవారు ఎక్కువే ఉన్నారు. వారి బాధలు, కష్టాలు, ఇక్కడ కుటుంబ సభ్యుల కష్టాల వర్ణణాతీతం. వారి వెతల్ని తెలుసుకోవడానకి, వివరాలు సేకరింవచడానకవ కరీనంగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రచయితలు వేదిక రుద్రంగి గ్రామ అద్యయనం కోసం వెల్లింది. దాదాపు నలభై సంవత్సరాల క్రితం, గల్ఫ్‌ దేశాల్లో పని మనుషుల కొరత వల్ల, వెనకబడ్డ ప్రనాంతాల ప్రజల&ఇన డబ్బులిచ్చి, ఆకర్షించి ఆయా దేశాలకు తరలించారు. ఇందులో ప్రవాన పాత్ర ఏజెంట్లదే . నాడు వెళ్లిన ప్రజలు, స్థిరమైన వసతి, పని, ఆదాయం పొంది తమ కుటుంబాలకు పంపేవారు. దానివల్ల ఆయా కుటుంబాలు ఉన్నత స్థితికి వచ్చాయి. తమ తొటి వారి అభివృద్ది చూసి తామూ వెళ్లాలనే ఆలోచనతో, అనేకమంది గల్ఫ్‌ దేశాలకు వలస బాట పటాటరు. అది ఇప్పుడు వ్యాపారమైంది రోజులు గడుస్తున్న కొద్దీ వలసలు పెరిగాయి. గల్ఫ్‌ దేశాల్లో విదేశీ పనివారి సంఖ్య పెరిగింది. ఫలి తంగా వలసపోయిన వారకి కష్ట, నాష్టాలు మొదలయ్యాయి. అయి నా ప్రజలు గల్ఫ్‌ వెళ్లడానికు ఆసక్తి చూపారు. ఈ దేశంలో ఏజెంట్ల వ్యకుల్ని విమానం ఎక్కించి చేతులలు దులుపుకోవడం మొదలు పెట్టారు. గల్ఫ్‌కు వెళ్లిన వ్యక్తి తనకు తెలియజేకుండానే చొరబాటు దారుడయ్యాడు. దొంగతనంగా గడపాల్సి వచ్చింది. ఈ విసయం నిరక్షరాస్యుడైన వలస వ్యక్తికి తెలియదు. ఒకవేళ తెలిసినా వెళ్లాల్సి న అనివార్యత వల్ల జరిగిన ఫలితం. రెండు సంవత్సరాల కాలప రిమితిపై వెళ్లిన వ్యక్తి పని అయిపోయి ఆరు నెలలలోపు రావడం, అక్కడికి వెళ్లినవారికి రోజు కూలీ వెతుక్కుంటూ దిన దినగండంగా బతకడం, పనిలేకపోవడం వల్ల అతన్ని ఏమీ చేయలేకపోవడం, కల్లి వెల్లిపై (దొంగతనంగా ఉండడం) ఉండడం వలన బిక్కు, బిక్కు మంట గడపడం, పనిలేకపోవడం వల్ల పని చేసిన రోజుల డబ్బు లతో విమానం టికెట్‌ కొని వ్యక్తిని తమ దేశం వైపు నెట్టడం, పని పరిస్థితులను వ్యక్తి తట్టుకోలేకపోవడం, వృత్తి నైపుణ్యం లేకపో వడం, వృత్తి నైపుణ్యం ఉన్నవాడికి కూలిపని దొరకడం, ఇలాంటి అనిశ్చిత పరిస్ళిలుల వల్ల గల్ఫ్‌ వెళ్లిన వ్యక్తలు అర్థాంతరంగా ఇంటికి రావాల్సి వస్తుంది. అక్షలు ఖర్చు పెట్టి వెళ్లడం, అక్కడ సంపాదించలేక తిరిగి రావడం వల్ల అప్పుల పాలయ్యారు. వడ్లీల వల్ల మరింత పీకల లోతుకు కూరుకు పోయారు. అప్పు తీర్చడం కోసం ఉన్న ఇళ్లును, వ్యవసాయ భూమిని అలమ్మి అనాధల య్యారు. చెట్టు కింద జీవితం గడుపుతునుఆ్నరు, ఏదొ కారణం వల్ల గల్ఫ్‌లో హత్యకు గురైన వారి భార్యబిడ్డలు, తల్లిదండ్రులు రెంటికీ చెడ్డ రేవడుల య్యారు. శవం రావడం కోసం ఉల్టా ఖర్చుపెట్టాల్సిన పరిస్థిత టిలోకి గల్ప్‌స బాధితులు నట్టబడ్డారు.నదీ లోయ నా గరికతలు వర్దిల్ల డానికీ, విస్త రించడానికీ మనిషి ఒక చోటు నుండి మరొక చోటు కి తరలి వెళ్లడమే కార ణం. ఆనాటి వలసల ఆదాన ప్రదానాల వల్ల నాగరికత, సంస్కృ తులు మిళితమయి కొత్త కళారూపాలు, జీవన మార్గాలు ఆవిర్బవించాయి. ఒక దశలో వలసలు మనిషి వికాసానికి దోహ దం చేశాయి. మరిప్పుడు మనిషి మరణా నికి ఎందుకు దారితీస్తున్నవి? నిజం చెప్పా లంటే గత ముప్పై సంవత్సరాల క్రితం వరకు వలస మంచి జీవికను ఇచ్చింది. వలసల కారణంగానే కుటుంబాలు, గ్రా మాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాయి. గ్రామ జీవన విదానాల్లో మార్పు తీసుకురావడం లోనూ, గ్రామ జీవన ప్రమాణాలు మెరుగు పరచడంలలోనూ ప్రజల వలసలు, ప్రభుత్వాల కంటే ఎక్కువ దోహదపడ్డాయి. గల్ఫ్‌ దేశాలయిన యుఎఇ(దుబాయి) సౌదీ అరేబియా, ఒమన్‌(మస్కట్‌), ఖతార్‌, కువైట్‌, బహ్రెయిన్‌ లాంటి దేశాల రియాళ్లు, దీనార్‌ల వంటి కరెన్సీ రూపాయలుగా మారి వ్యవసాయ బావులు, బోర్లు తవ్వించాయి. సాగునీటి పారుదల కు ఉపకరించాయి. సాగు విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడి పెరిగింది. రకరకాల వ్యాపారాలు పెరిగాయి. మొత్తానికి గ్రామ ముఖచిత్రం మారింది. ఇదంతా ఒక పార్శ్వం. ఈ మార్పులన్నీ వలసల్ని ఉదృ తం చేసాయి. ఎనభైయవ దశకం నుండ ఇవలసుల ఊపం దుకున్నాయి. గల్ఫ్‌లో లేబర్‌ చవక అయింది. పనులు తక్కువయి, లేబర్‌ ఎక్కువ అవడమనే దశ ఏర్పడింది. గల్ఫ్‌ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించడం, గడువులోపల స్వదేశాలకు వెళ్లని వారిని జైళ్లలో తోస్తామనడం సమస్యకు పరాకాష్ట, దీపకాంతికి భ్రమపడి శలభాలు మంటలో పడి మసైనట్లు పెట్టుబడకి ఆకర్షితులైన ప్రజలు వలస వెళ్ల తమ బతుకులను ఆగంచేసుకుంటున్నారు. ఇదంతా ఎనభై దశకం తర్వాత జరుగుత్ను క్రమం. దీనికి ప్రధాన కారణం గ్లోబలైజేషన్‌, కులవృత్తులు నశించిన వృత్తిపనివారు, వ్యవసాయం భారమైన రైతులు వలస వెళ్లారు. రాజ్యహింస కూడా దినికి తోడ యింది. మొత్తానికి వీరందరు వలస కూలీలు అయ్యారు. గల్ఫ్‌లో పనులు లేకపోవడం, ఉన్నా పూర్తికాలం దొరకకపోవడం, మొత్తానికి పని కరువు కావడం వల్ల వేళ్లినవారు ఉత్త చేతులతో తతిరిగి వచ్చారు. ఖర్చులు మీదపడడం వల్ల చిన్న రైతులు భూములు, చేతిపనివారు ఇండ్లు అమ్ముకొని కొంత అప్పు తీర్చారు. అధశిక వడ్లీ వల్ల అప్పులు పెరిగాయి. దాదని వల్ల వారి బతుకులు దుర్బరమై, జీవం లేని మనుషులుగా బతుకులీడుస్తున్నారు. ఆధుని క ప్రభుత్వాలు ఎక్కువగా సంక్షేమ పథకాల మీదే దృష్టి పెడు తున్నాయి. ఇలాంటి పథకాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నవి. ఆరోగ్యశ్రీ, వృద్దాప్య పింఛన్‌, బియ్యం పధకాలు, సబ్సిడీ పథకాలు, ఉపాధి హామీ, వివిధ రకాల ఉద్యోగ పధకాలు. ఇలా ప్రజాకర్షక పధకాలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్‌ బాధితులు ఇలాంటి పథకాలకు లబ్దిదారులుగా ఉన్నారా? అనేది ప్రశ్న. కొంతమంది గల్ఫ్‌ బాధిత పురషులకు ఇలాంటి పథకాలు ఊసే తెలియదు. వినడానికవ ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మలేని నిజం ఇది. మోసపోయి, అప్పుల ఐబిలో మునిగిన మగవారు, యాంత్రికంగా పనిచేస్తూ మత్తులో మునుగుతునానరు. ఆయా కుటుంబాల స్త్రీలు సంపారాల్ని నెట్టుకొ స్తున్నారు. స్త్రీలు క్రియమాశీలంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను వీరు సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఇతటి చురుకు దనం వలసపోయి వచ్చిన మగవారిలో కనిపించలేదు. అత్యంత నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా బతుకులీడుస్తున&ఆనరు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి, ఓట్లు వేయించుకునే పార్టీఉ వీరిని దత్తత తీసుకోవాలి. అప్పుడే పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తుల కన్నా ఉన్నత స్ధాయిలో నిలుస్తాయి. గల్ఫ్‌ వెళ్లిన వారి అనుభవాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. లేబర్‌గా ఇక్కడి నుండి వెళ్లిన వారి పరిస్థితి బానిసలుగా ఉంటుంది. కల్లివెల్లిపైఉంటే దినదిన గండం నూరేళ్లా యిషే, మహ్మద్‌ ఖాసిం అనుభవాన్ని ఆయన మాటల్లోనే విందాం. ‘ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు నాకు. భూమి లేదు. సౌదీకి పోయినాకిల్లు అమ్మిన. ఇపుపడు ఇందిరమ్మ ఇల్లు ఉంది. మందని చూసి పోయిన, తోటపని అంటే పోయిన, పోయినాంక గోర్లుకా యమపెట్టిండ్రు. దుబ్బల మీదికి (ఎడారి ఇసుక దిబ్బలు) గొర్లు కాయపెట్టిండ్రు. వాటిని పట్టుకొని నేను ఒక్కన్నే ఉన్న ఉన్న,పిస్సలేసినట్టు ఉంది.మనిషి తోడు లేదు.నాకు తోడుగా గాడిద ఉంది.500గొర్లు ఉన్నాయి.వాటికి కాపల నేను.అక్కడ ఉన్న ఐతు నెలలు నేను స్నానం చేయలేదు.వారానికి ఒకసారి మనిషి వచ్చి రొట్టెలు ,ఆవు నెయ్యి,ఐదు లీటర్ల నీళ్ల డబ్బ ఇచ్చిపోయేవాడు.ఐదు నెలలు ఉండే సరికి పానం పోయినట్టు అయింది.డెబ్బది వేలు పెట్టి పోయిన అక్కడోళ్లు విమాన టికెట్టు కొనిచ్చి పంపించిండ్రు.టికెట్‌ ఖరీదు కింద జీతం ఉంచుకున్నారు.వచ్చినాంక ఇళ్లు అమ్మిన.కొంత భాకీతీరింది.ఉన్న ఊళ్లే గంజినీళ్లు తాగి బ్రతికినా మంచిదే.వలస మాత్రం పోను.అని ముగించిండు.చాలా మందిని కలిసాం.ఏ ఒక్కరి అనుభవం సంతోషకరంగా లేదు.వలసలనుంచి లాభం పొందిన వారు కూడా ఏదో గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నట్టు కనిపించింది.