గిరిగీసి నిలబడదాం తెగించి కొట్లాడుదాం
శ్రీతెలంగాణ సాధిద్దాం శ్రీఆత్మహత్యలు వొద్దు బిడ్డా
జేఏసీ చైర్మన్ కోదండరాం
వరంగల్, ఆగస్టు 24 (జనంసాక్షి): :తెలంగాణ రాష్ట్ర సాధనకు గిరిగీసి నిలబడి తెగించి కోట్లాడి తెలంగాణ సాధించుకుందామని ఆత్మహత్యలు మన సంస్క ృతి కాదని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సోమ వారం తెలంగాణ విద్యార్ధి పరిషత్ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లడుతూ తెగించి కోట్లడితే తెలంగాణ వస్తుందని కేంద్రం మెడలు వంచే దిశగా జేఏసీ నాయకత్వం కార్యచరణ రూపొందిచు కుని పోరాడు తాంఅని అన్నారు. సెప్టెంబర్ 30 మార్చ్ కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ పై బిల్లు ప్రవేశ పెట్టెదాకా పోరాటం ఆగదని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసే విద్యార్ధుల అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారుఅని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, నేతన్నలకు విద్యుత్ నిరంతం ఇచ్చి,రైతులకు ఎరువులు సకాలంలో అందజేయాలని విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు అందజేయాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థు జీవితాలతో చెలగాటమాడితే ఉరుకునేది లేదని ఆయన ప్రభుత్వన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్రాంరెడ్డి, విద్యార్ధి పరిషత్ జిల్లా అధ్యక్షుడు రంజీత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్సా తిరుపతి రడపాక విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.