గుట్టు విప్పుతున్న కాక్‌పిట్
తలుపులు తీయమని కెప్టెన్ అరుపులు
ప్రయాణికుల ఆర్తనాదాలు
‘జర్మన్ వింగ్స్’ ప్రమాదంపై బిల్డ్ పత్రిక కథనం
డ్యూజెల్‌డార్ఫ్, మార్చి 30(జనంసాక్షి) : జర్మన్‌వింగ్స్ విమానంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లోని సమాచారం ఆధారంగా.. జర్మన్ పత్రిక బిల్డ్ మరో కథనాన్ని ఆదివారం ప్రచురించింది. విమానాన్ని కావాలనే అల్ప్స్ పర్వతాలకు ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యాడని భావిస్తున్న కో-పైలట్ ఆండ్రియాజ్ ల్యూబిట్జ్‌కి, కెప్టెన్‌కు జరిగిన సంభాషణను దీనిలో ప్రచురించింది. కాక్‌పిట్ తలుపు తీయాలంటూ కెప్టెన్ బిగ్గరగా అరిచారని, దీనితోపాటు ప్రయాణికుల ఆర్తనాదాలు సైతం వాయిస్ రికార్డర్‌లో నమోదయ్యాయని బిల్డ్ తెలిపింది. ఫ్రెంచ్ అధికారులు సైతం ఈ విషయాన్నే ధ్రువీకరించారు. మరో ఎనిమిది నిమిషాల్లో విమానం కూలిపోతుందనే సమయంలో.. కాక్‌పిట్ తలుపు తీయాలంటూ కెప్టెన్ గట్టిగా అరిచిన శబ్దాలు వాయిస్ రికార్డర్‌లో నమోదయ్యాయని వారు తెలిపారు. బాత్‌రూంకి వెళ్లి వచ్చిన అనంతరం కాకిపిట్ తలుపు తీయడానికి కెప్టెన్ ప్రయత్నించినట్లు వారు భావిస్తున్నారు. గొడ్డలితో తలుపును ధ్వంసం చేయడానికి కెప్టెన్ ప్రయత్నించారని బిల్డ్ వివరించింది. బార్సిలోనా నుంచి విమానం బయలుదేరినప్పుడు అతడికి బాత్‌రూంకి వెళ్లడానికి సమయం లేదని, ఈ విషయాన్ని కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లేముందు సహచరుడికి వివరించారని పేర్కొంది. కోపైలట్ ల్యూబిట్జ్‌కి డిప్రెషన్‌తో పాటు దృషి ్టలోపం కూడా ఉన్నట్లు జర్మన్ మీడియా తెలిపింది.