గుట్ట అభివృద్ధికి బాటలు

5

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి పునర్నిర్మాణంపై సవిూక్ష నిర్వహించారు. గురువారం యాదాద్రి సందర్భించి అక్కడ పరిస్తితిని తెలుసుకున్న సిఎం మరోమారు సవిూక్ష చేపట్టారు.  సమావేశంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యేలు గొంగడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో నడుస్తున్న అభివృద్ధి పనుల గురించి సీఎంకు అధికారులు వివరించారు. యాదగిరిగుట్టను పూర్తి స్థాయిలో నూతనావిష్కరణ గావించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉద్ఘాటించారు. యాదాద్రిలో రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తామని స్పష్టం చేశారు. అనువైన నివాస సముదాయాలను, వ్యాపార కేంద్రాలను నిర్మిస్తామని తెలిపారు. యాదాద్రి పరిసర ప్రాంతాలను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దేశం గర్వించేలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో నష్టపోయే వ్యాపారులకు పరిహారం చెల్లించాకే పనులు మొదలుపెడతామని  హావిూ ఇచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా భక్తులకు దర్శనం కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేయనున్న బాలాలయం పనులను గడువులోపు పూర్తిచేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. టెంపుల్‌ సిటీ అభివృద్ధి, రోడ్డు విస్తరణలో వ్యాపారులకు జరిగే నష్టం, కొత్తగా ఏర్పాటు చేయనున్న వ్యాపార సముదాయాలు తదితరాలపై ముఖ్యమంత్రి సవిూక్షించారు.