గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురి అరెస్టు
ఖమ్మం,ఆగస్టు 15: నేలకొండపల్లిలోని ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.