గొంతు తడిపేది ఇక గోదావరే !
తెలంగాణ ఆంధ్రాలకు ఇప్పుడు గోదావరే దిక్కుగా మారింది. అదికూడా వర్షాలు పడి గోదావరి ప్రవహిస్తేనే నీరు వస్తుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణకు గోదావరి నీరు రావడం తక్కువే. భద్రాచలం కిందినుంచే గోదావరి ఉధృతి ఉంటుంది. దీంతో దిగువన ఉన్న ఎపికి మాత్రమే గోదావరిని పూర్తిగా ఉపయోగించుకునే వీలుంది. మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించుకున్న ప్రాజెక్టుల కారణంగా కిందికి నీరురాకపోతే తెలంగాణలో గోదావరి గొంతెండాల్సిందే. ఇక కర్నాటకలో కృష్ణ నదిపై కూడా ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడం వల్ల కృష్ణమ్మ పరుగుల ఆగిపోయాయి. భారీవర్షాలు పడితే తప్ప ఇక్కడా నీరుచేరే అవకాశాలు లేకుండా పోయాయి. జాతీయ జలవిధానం లేకపోవడం వల్ల ఎగువ రాష్టాల్ర కారణంగా కింది రాష్టాల్రు ఇబ్బందులు పడుతున్నాయి. కర్నాటక కారణంగా కావేరీ విషయంలో తమిళనాడు కూడా నీటి కోసం ఇబ్బందులు పడుతోంది. ఈ దశలో రాష్టాల్ర మధ్యనీటి పంపకాలకు సంబంధించి సగ్ర విధానం ఉండాలి. ఇవి ఖచ్చింతంగా అమలు కావాలి. కేంద్రం అజమాయిషీలో జాతీయ విధానం అమల్లోకి రావాలి. అప్పుడే నీటి పంపకాల విషయంలో పేచీలు రావు. తెలుగు రాష్టాల్రకు ఇప్పుడు గోదావరిపైనే ఆశలు ఉన్నాయి. తెలంగాణ వరకైతే నీటి సమస్య తీవ్రమనే చెప్పాలి. ఎపికి కనీసం గోదావరి వినియోగించుకునేలా ఏటా నీరు వచ్చి చేరుతుంది. ఈ నీటి పంపకాల విషయంలో పరస్పర సహకారం అవసరం. వీలయితే మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఎపిల మధ్య కృష్ణాగోదావరి మధ్య నీటి పంపకాలు ఎలాంటి విభేదాలు లేకుండా సాగాలి. మహారాష్ట్ర, కర్నాటకలో కృష్ణా, గోదావరి నదులపై 450 అక్రమంగా బ్యారేజీలు నిర్మించారని, దీని వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రకు ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. రానురాను కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోతున్నది. ఎగువ రాష్టాల్రైన కర్నాటక, మహారాష్ట్రలు భారీ ప్రాజెక్టులు నిర్మించేసుకోవడం వల్ల సమైక్యంగా ఉన్నపుడే ఆంధ్రప్రదేశ్‌కు నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కారణంగానే అన్ని రాష్టాల్ర దృష్టి గోదావరి వైపు మళ్లింది. రాజకీయ అవసరాలను, అవకాశాలను పక్కన పెట్టి ఇప్పటికైనా ఇరు రాష్టాల్రు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టును కట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరిని కృష్ణాకు తరలించే బృహత్తర పథకాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నీటి లభ్యతపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ తరవాత గోదావరి పంపకాలపై సిఎం కెసిర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ, ఎపిలు గోదావరి జలాల విషయంలో గిల్లికజ్జాలకు పోకుండా జలపంపిణీ చేసువాల్సి ఉందన్నారు. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నీటి సామర్ధ్యం భారీగా తగ్గిపోవడానికి నీటి అలభ్యత కూడా ప్రధాన కారణం. అనేక కారణాలతోనే తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం ఒక రకంగా కష్టసాధ్యమైన విషయంగా మారింది. నదులు ప్రవహించే మట్టం కన్నా ఎగువన తెలంగాణ రాష్ట్రం ఉండడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణానికి, నీటి వాడకానికి అడ్డంకిగా ఉంది. అందుకే ఎంతో పట్టుదల ఉంటే తప్ప తెలంగాణ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడం సాధ్యం కాదు. అయితే పొరుగు రాష్టాల్రతో పేచీ లేకుండా సిఎం కెసిఆర్ తొలుత మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. తరవాత ఇప్పుడు ఎపితో కూడా కలసి పోతామని అన్నారు. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు విడిపోయినా ఒకరికొకరు సహకరించుకోక తప్పదని చెప్పడం వల్ల నీటి అవసరాలను ఉమ్మడిగా వాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.రాజకీయ అవసరాలను, అవకాశాలను పక్కన పెట్టి ఇప్పటికైనా ఇరు రాష్టా లు సహకరించుకోవాల్సిన అవసరం
ఉంది. మహార్రాష్ట, కర్నాటకలో కృష్ణా, గోదావరి నదులపై 450 అక్రమంగా బ్యారేజీలు నిర్మించారని, దీని వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రకు ముప్పు పొంచి ఉంది. క్చామెంట్ ఏరియాలో పడే వర్షపు నీరే తప్ప, నది నీళ్లకు ఆస్కారం లేదు. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 35 సంవత్సరాల చరిత్రలోనే సింగూర్ ప్రాజెక్టు ఎండిపోగా, శ్రీరాంప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు రీడిజైన్ చేయకపోతే తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని సిఎం కెసిఆర్ నిర్ణయించి, దానికి అనుగుణంగానే కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగంపైనా ఇరు రాష్టాల్ర సిఎంలు పట్టుదలగా పనిచేసేందుకు నిర్ణయించడం విశేషం. సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలని సంకల్పించారు. ఇదో మంచి నిర్ణయంగా భావించాలి. నిజానికి గతంలో ఎన్నుడో ఈ పనిచేసి ఉండాల్సింది. ఆలస్యంగా అయినా గోదావరి జలాలలను సద్వినియోగం చేయడం ద్వారా ఇరు రాష్టాల్ల్రో ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలనుకోవడం ఓ చారిత్రక నిర్ణయంగా భావించాలి. పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు మళ్లించే ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల గోదావరి నీటి వినియోగంపై ప్రణాళికలు ఊపందుకోనున్నాయి. గోదావరి నదిపై ఇంకా ఎక్కడెక్కడ ఆనకట్టలను కట్టే అవకాశం ఉందో పరిశీలించాలని సాగునీటి శాఖ ఇంజనీర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు. ఈ ప్రాంతంలోని నదుల నుంచి పారే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్టాన్న్రి సస్యశ్యామలం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పుడున్న కరువును తరిమికొట్టాలంటే ప్రతి నీటి బొట్టునూ వాడుకోవాలి. అందుకు గోదావరిపై కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. మొత్తానికి జలాల వినియోగంలో దేశానికి ఆదర్శం కాబోతున్నందుకు తెలుగువారిగా మనం గర్వపడాలి.