గొర్రెలపంపిణీ బదులు లక్ష ఇరవై వేయిల నగదును ఇవ్వాలి.

రాష్ట్ర యాదవ సంఘం యూత్ ప్రెసిడెంట్ తగుళ్ల అంజి యాదవ్.

 

అచ్చంపేట ఆర్సీ,సెప్టెంబర్19 (జనం సాక్షి )న్యూస్ : అర్హులైన గొల్ల కురుమలకు రెండో విడతలోనైనా గొర్రెల పంపిణీ బదులు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోనే వేయాలని రాష్ట్ర యాదవ సంఘం యూత్ ప్రెసిడెంట్ తగుళ్ల అంజి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా స్థానిక పట్టణంలో సోమవారం రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలను ఆర్థికంగా ఆదుకునేందుకు చేపట్టిన గొర్రెల పంపిణీలో అనారోగ్యమైన దంతాలు ఊడిపోయిన గొర్రెలను ఇచ్చారని ఇదే క్రమంలో గొర్రెల పంపిణీలో చాలావరకు అవకతవకలు అవినీతి జరిగిందని కావున ఇదే సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో నగదును ఇవ్వడం వలన లబ్ధిదారులు తమకు నచ్చిన రోగాలు లేని ఆరోగ్యవంతమైన, గొర్రెలను కొనుగోలు చేయడం తో పాటు అందుబాటులో ఉన్న ధరలో గొర్రెలను కొనేందుకు వీలుపడుతుందని తద్వారా గొల్ల కురుమలకు మేలు జరుగుగుతుందని ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.