గ్రామపంచాయితీ ఎంప్లాయిస్ డివిజన్ స్థాయి కమిట ఏర్పాటు
పెనుబల్లి, అక్టోబర్ 23(జనం సాక్షి)పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వేదికగ తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీఎంప్లాయిస్ సత్తుపల్లి నియోజక వర్గ డివిజన్ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది,సత్తుపల్లి నియోజక వర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి,సత్తుపల్లి, వేంసూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయితీ లలో పని చేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటంచేయటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని కమిటీ సభ్యులు తెలిపారు, కమిటీ అధ్యక్షుడు గా దాసరి చెన్నారావు గౌడ్,ఉపాధ్యక్షుడు గా ఆదూరి వీరయ్య, కార్యదర్శిగా కొప్పుల ఆంజనేయులను ఎన్ను కోడం జరిగింది.