గ్రామాలకు చేరిన బతుకమ్మ చీరలు

మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) బతుకమ్మ సంబరాలు ఈనెల 25వ తేదీన ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసినందుకు శ్రీకారం చుట్టింది.మల్దకల్ మండలంలోని రేషన్ దుకాణాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. మంగళవారము కుర్తి రావులచెరువు గ్రామ సమీపంలోని ఉన్న గోదాంలో బతుకమ్మ చీరలను ఆయా గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల ద్వారా చేరవేశాయి.ఎల్కూరు, చర్ల గార్లపాడు,విఠలాపురం, అమరవాయి,మల్దకల్, పాల్వాయి,బిజ్వారం,మద్దెల బండ తండా తదితర గ్రామాలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.మండలానికి 50 శాతం మాత్రమే బతుకమ్మ చీరలు వచ్చాయని,మిగతా చీరలు రెండు దశ వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామాలలో ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ  గద్వాల మార్కెటింగ్ అధికారులు దగ్గర ఉండి రేషన్ డీలర్లకు చీరలను చేరవేస్తున్నారు.గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని మంగళవారము బతుకమ్మ చీరలను పలు వార్డులో పంపిణీ చేసి ప్రారంభించారు.