గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దండి: ఎమ్మెల్యే
కామారెడ్డి,జూలై25(జనంసాక్షి): ప్రతీ గ్రామాన్ని నందనవనంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. అన్ని మండలాల్లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు ఉమ్మడిగా హరితహారం కింద మొక్కలు నాటాన్నారు. గ్రామాలను పచ్చగా ఉంచుకోవాలన్నారు. పారిశద్యం కోసం పనిచేయాలన్నారు. అప్పుడే నిధుల విడుదలకు అవకాశం ఉంటుందని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కృషిచేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని, నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలని అన్నారు. ప్రతిగ్రామంలో 85 శాతం పచ్చదనం కనిపించేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. రైతులు తమ పొలం గట్లపై శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు నాటేందుకు ముందుకు రావాలని, తెలిపారు.