గ్రామీణ బ్యాంకులను ప్రై’వేటు’ వద్దు -ఎంపీ వినోద్‌

1

న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచన సరైంది కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద గ్రావిూణ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న వినోద్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని దక్కన్‌ గ్రావిూణ బ్యాంకు, ఏపీ గ్రావిూణ వికాస్‌ను కలిపి తెలంగాణ గ్రావిూణ బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం తమ వాటాను అమ్మదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మితే బాగుంటుందని సూచించారు. పార్లమెంట్‌ సమావేశాల తర్వాత ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే గ్రావిూణ బ్యాంకు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని పేర్కొన్నారు.