ఘనంగా గణేష్ మండపాలలో కుంకుమ పూజలు, మహన్నదానం, దీపోత్సవం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నవరాత్రులలో భాగంగా గురువారం గంగా కాలనీ షిర్కే గణేష్ మండలిలో పుర పరిధిలోనే అత్యంత ఖరీదుకు గణేష్ లడ్డూను వేలం పాటలో 22,816 రూపాయలకు కాసరాజపు పోషం దక్కించుకున్నారు. పట్టణంలోని శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయంలో విఘ్నేశ్వర స్వామి సన్నిధానంలో నీ లడ్డూనీ ఆలయ కమిటీ నిర్వహించిన పాటలో పాల్గొని 2, 500 ల రూపాయలకు స్థానికుడు జంగం పెల్లి మల్లయ్య కైవసం చేసుకున్నారు. భగత్ సింగ్ నగర్ లోని ఫ్రెండ్స్ గణేష్ మండలి వద్ద మహిళలు కోలాటాలతో నృత్యాలు చేశారు. యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజ, మహా అన్నదానం, బి జోన్ సెంటర్ జనతా సిటీ కేబుల్ ముందర లోని యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహా అన్నదానం పట్టణ ఎస్ఐ బి అశోక్ ప్రారంభించారు. భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలోని బాల గణేష్ మండలిలో ఘనంగా దీపోత్సవం నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతోదీపాలువెలిగించారు. జట్ల రితిక పసుపు, వరి పిండితో తయారుచేసిన విఘ్నేశ్వరుని ప్రతిమ చూపరులను అలరించాయి. నేటితో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగుస్తున్నందున వివిధ మండపాలలోని అధ్యక్ష, కార్యదర్శులు గణపతిని కోరిన కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో తీర్థ ప్రసాద స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.