ఘనంగా గీతా పనివారుల సంఘం వార్షికోత్సవ వేడుకలు.
మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 21
గీతా పని వారుల సంఘం 65వ వార్షికోత్సవ వేడుకలు మల్లికార్జున నగర్ లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతా పని వారుల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.గీతా కార్మికునికి ఐదు వేల రూపాయల పింఛన్,ప్రమాద బీమా 10 లక్షలకు పెంచాలని,ప్రతి గ్రామంలో ఈత వనం పెంచడానికి ఐదు ఎకరాలు కేటాయించాలని,గౌడ బంధు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.ఈకార్యక్రమంలో వెంకటేష్ గౌడ్,సాయి కిరణ్ గౌడ్,రాజశేఖర్ గౌడ్,రాజ కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్,రాములులింగం,ప్రభాకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.