ఘనంగా జాతీయ సినిమా అవార్డులు ప్రదానం

2

న్యూదిల్లీ,మే3(జనంసాక్షి): జాతీయ 63వ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా జరిగింది. 2015 సంవత్సరానికి సంబంధించి సినీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.43వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు మనోజ్‌కుమార్‌ అందుకున్నారు.

ఉత్తమ చిత్రం.. బాహుబలి

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ పురస్కారం అందుకుంది. భారీ చిత్రంగా తెరకెక్కిన ‘బాహుబలి’ తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటడంతో పాటు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన తొలి తెలుగు చిత్రంగా ఖ్యాతి పొందింది. దీంతో స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో బాహుబలి జాతీయ అవార్డు అందుకుంది. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ అవార్డును సొంతం చేసుకుంది.

పురస్కారాలు అందుకున్న వారు…

ఉత్తమ నటుడు- అమితాబ్‌ బచ్చన్‌(పీకూ),ఉత్తమ నటి- కంగనా రనౌత్‌(తను వెడ్స్‌ మను రిటర్న్స్‌),దర్శకుడు- సంజయ్‌ లీనా భన్సాలీ( బాజీరావ్‌ మస్తానీ,ఉత్తమ స్క్రీన్‌ప్లే- విశాల్‌ భరద్వాజ్‌(తల్వార్‌),బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- సుదీప్‌ ఛటర్జీ(బాజీరావ్‌ మస్తానీ, ఉత్తమ సహాయ నటుడు – సాముతినకనికి(విశారనై),ఉత్తమ గాయకుడు- మహేష్‌ కాలే,ఉత్తమ గాయని- మొనాలీ ఠాకూర్‌,జనరంజక చిత్రం- భజరంగీ బాయిజాన్‌,బెస్ట్‌ కొరియోగ్రఫీ- రెమో డిసౌజా(బాజీరావ్‌ మస్తానీ),సోషల్‌ ఇష్యూస్‌ ఫిల్మ్‌- ఆటోడ్రైవర్‌,బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిల్మ్‌- పేవాట్‌,బెస్ట్‌ యానిమేషన్‌ ఫిల్మ్‌- ఫిషర్‌ ఉమెన్‌ అండ్‌ టుక్‌ టుక్‌