ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తొర్రూరు:23 అక్టోబర్( జనంసాక్షి )
25 సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదివిన విద్యార్థులంతా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఆదివారం మండలంలోని హరిపిరాల గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1996-97 టెన్త్ బ్యాచ్  పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
తరగతి గదిలో చేసిన అల్లరి,  స్నేహితులతో కలిసి చేసిన సరదా ఘటనలు, ఉపాధ్యాయులు, పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.
పాఠాలు చెప్పిన గురువులు రవి, రామ్ రెడ్డి, లింగయ్య భాస్కరాచారి, ఉప్పలయ్య, పిచ్చయ్య లను శాలువాతో సత్కరించారు.
చివరగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు.  స్నేహితులు గురువులతో కలిసి ఫోటోలు దిగి పసందైన భోజనం ఆరగించారు.
ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థీ వివిధ వృత్తుల్లో,ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు యుగేందర్, కుమారస్వామి, సుభాష్, ఆంజనేయులు, భాస్కర్, శ్రీను, యామిని, వరలక్ష్మి, మంజుల శ్రీలత , అమృత తదితరులు  పాల్గొన్నారు.


Sent from Email.Avn for mobile