*ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు*

కొడకండ్ల, ఆగస్టు 20(జనం సాక్షి):రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కొడకండ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలపై దృష్టి సారించి దేశ ప్రజలను కాపాడుకున్నాడని అన్నారు.1984 అక్టోబర్ 31న తల్లి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన సమయంలో ప్రధానమంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయన నిర్వర్తించాల్సి వచ్చిందని, వ్యక్తిగత దుఃఖాన్ని, విచారాన్ని అణచుకొని జాతీయ బాధ్యతను ఎంతో హుందాగా, ఎత్తుకున్నారన్నారు.
పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు  ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ
నెల రోజులపాటు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలుపు అలసట లేకుండా ప్రయాణించారని. అనేకచోట్ల 250 సభల్లో మాట్లాడి. కోట్లాది మంది ప్రజలతో ముఖాముఖి జరిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనరసయ్య, పట్టణ అధ్యక్షులు మసురం రవీందర్, మండల యూత్ అధ్యక్షులు దూదిమెట్ల యాకేష్ యాదవ్, మండల ఎస్టీ  సెల్ అధ్యక్షులు జాటోథ్ రాహుల్ నాయక్, ఎఫ్ఎస్ సిఎస్ డైరెక్టర్ వీరదాసు శ్రీనివాస్, బత్తుల వెంకన్న, మసురం  మనోహర్, సోమారపు ఐలయ్య, వెంకటయ్య, నాయిని కనకయ్య, దోర్నం సోమయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.