ఘర్‌వాపసీతో భాజపాకు చుక్కెదురు

4

తగ్గుతున్న మోదీ పాపులారిటీ

ఇండియాటుడే-సిసిరో సర్వే వెల్లడి

న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్‌ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే-సిసిరో సర్వే నిర్వహించింది. ‘ఘర్‌ వాపసి’ కార్యక్రమంతో ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. మరో 27 సీట్లు తగ్గుతాయని ఈ సర్వే తేల్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అంతా మోదీకి మద్దతు తెలపడంతో భాడపా 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి అధికారమిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక మోడీ అనుచరులు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలు, ప్రచారాల మూలంగా, ఘర్‌వాపసీ లాంటి కార్యఖ్రమాల మూలంగా మోడీ క్రేజ్‌ రోజురోజుకూ తగ్గిపోతోంది.