చట్టం తన పని తాను చేసుకుంటుంది తిరగబడితే సహించేది లేదు ఎస్సై సాయిరెడ్డి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 20
కామారడ్డి జిల్లా గాంధారి మండలంలోని కుమ్మరి సాయన్న సంగయ్య నాగయ్య ముగ్గురు అన్నదమ్ములు కాక అందులో పెద్దన్న అయినా సాయన్న ఇంటి దగ్గరికి నాగయ్య ప్రవీణ్ లు తరచు ఆస్తి గొడవలకు దారి తీసే విధంగా మీదేం లేదు ఇల్లు కూడా మాదే అని  బెదిరించగా నిన్నటి రోజు సాయన్న కోడలు ఇంటిదగ్గర ఒక్కతే ఉన్నందున నాగయ్య కొడుకు ప్రవీణ్ మద్యం తాగి వచ్చి ఇంట్లో చేరి భయభ్రాంతులకు గురిచేసి ఆమెను ఇంట్లో వేసి బయట నుండి తాళం వేసి మీది ఏం లేదు ఆస్తి మాదే ఇల్లు మాదే అని గొడవ చేశారు సాయన్న కోడలు సుమలత 100 డయల్  చేసింది సమాచారం తెలుసుకున్న గాంధారి ఎస్సై సాయిరెడ్డి ఏఎస్ఐ గణేష్ ను ఇంటికి పంపించగా సివిల్ మ్యాటర్ అని చెప్పే ప్రయత్నం చేయగా ఏఎస్ఐ గణేష్ కాలర్ పట్టుకుని నాగయ్య  కొడుకు ప్రవీణ్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించగా ఎస్సై సాయిరెడ్డి ఇంటికి వెళ్లి సర్ది చెప్పి తాళం తీసి సాయన్న కోడలుని బయటకు తీసుకురాగా సుమలత ఫిర్యాదు మేరకు నాగయ్య ప్రవీణ్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు అని ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు