చట్టాలపై అవగాహన అవసరం

ఎస్సై విశ్వజన్

దోమ :

 

గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహణ పెంపొందించుకోవాలని ఎస్ఐ విశ్వజన్ సూచించారు. మంగళవారం దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో కళాజాత బృందం వారిచే సైబర్ నేరాలు, మూడనమ్మకాలు, చట్టాలపై గ్రామస్తులకు అవగాహణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విశ్వజన్ మాట్లాడుతూ.. శాంతిల భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. బాల్య వివాహాలకు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. టూవీలర్ వాహణదారులు హెల్మెట్, ఫోర్ వీల్లర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకొని వాహనాలను నడిపించాలన్నారు. వాహనాలకు సంబంధించి ధ్రువ పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మధ్యం సేవించి వాహనం నడిపించారాదని తెలిపారు. గ్రామాలలో తల్లితండ్రులు, వృద్ఫులపై అమానుష ఘటనలు జరుగుతున్నాయని వారి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవలే బాస్ పల్లి గ్రామంలో తండ్రిపై కూమారుడు, కొడలు దాడికి పాల్పడ్డారని వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించమన్నారు. అలాంటి సంఘటన ఎవ్వరు పాల్పడిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో ఎలాంటి సంకటనలు చోటుచేసుకున్న వెంటనే 100 డయల్ కు ఫోన్ చేయాలని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్చన, పోలీస్ సిబ్బంది,కళాజాత బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.