చర్చించుకుందాం రా!
-ఉగ్రవాద,హింసలేని వాతావరణం సృష్టిద్దాం
-పాక్ ప్రధాని నవాబ్‌కు మోదీ లేఖ
-భగత్‌సింగ్‌కు ప్రధాని ఘన నివాళి
దిల్లీ మార్చి 23 (జనంసాక్షి): పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా మోదీ లేఖలో శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని సూచించారు. ఉగ్రవాదం, హింస లేకుండా ప్రశాంతవాతావరణం తీసుకురావాలని మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సూచించారు.ఇది ఇలా ఉండగా పంజాబ్ వీర పుత్రులు, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య సమరానికి ముందు, తర్వాత కూడా పంజాబ్ వీరులు దేశం కోసం ప్రణాలు బలి చేశారని గుర్తు చేశారు. భగత్‌సింగ్ పేరు వింటేనే దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ.. బాలలు, వృద్ధుల్లో చైతన్యం, ప్రేరణ కలుగుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుంచే దేశ భక్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దేశరక్షణలో పంజాబీల పాత్ర అమోఘమన్నారు. వీరి తరవాతనే ఎవరైనా అని కొనియాడారు. పంజాబ్‌లో నీటి సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మోదీ అన్నారు. వీరుల అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించి నివాళి అర్పించారు.