“చలో కలెక్టరేట్” అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో…

24వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

– మద్దతుగా కాంగ్రెస్, సిపిఐ పార్టీలు…

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 11 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద ముంపు బాధితుల రిలే నిరాహార దీక్ష 24వ రోజుకు చేరింది. ఈ క్రమంలో బూర్గంపహాడ్ మండల అఖిలపక్ష జేఏసీ నేతలు సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 24వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పాల్గొన్న వారికి జేఏసీ కన్వీనర్ కే వీ రమణ పూలమాలలు అందించి దీక్షను ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ దీక్షకు మద్దతుగా…

ఆదివారం కాంగ్రెస్ నాయకులు మాాజీ శాసనసభ్యులు చందా లింగయ్య దీక్షలొ పాల్గొని సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 రోజుల నుండి దీక్ష కొనసాగుతున్న నేటికీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పందించక పోవడం విచారకరమని, దీనికి ఖండన తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్య పరిష్కారం దిశగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోవు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తన మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందా సంతోష్, బర్ల నాగమణి భాగ్య వెంకట్రావు, మహమ్మద్ ఖాన్ ఆయన వెంట ఉన్నారు.

సిపిఐ పార్టీ దీక్షకు మద్దతుగా…

సిపిఐ పార్టీ నాయకులు పేరాల శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి సిద్ధారపు, ఎస్ కే జహీర్, పిచ్చమ్మ, పెరుమళ్ళ ఎస్ కె గౌస్య బేగం, సాజిద్, ఎండిరాయల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.