చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు,పట్టణ రజక సంఘ నాయకులు చిత్తలూరి సైదులు అన్నారు.నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ 37వ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా వారు హాజరైన.ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ తెలంగాణలో నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేశారని కొనియాడారు.ఆనాడు రజకులు గ్రామీణ ప్రాంతంలో భూస్వాములకు ఉచితంగా వెట్టిచాకిరి చేసే వారిని వెట్టిచాకిరి చేయకపోతే రజకుల పైన దౌర్జన్యాలు చేసావారని వాటిని కళ్లారా చూసిన ఐలమ్మ వెట్టి చాకిరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి విముక్తి కల్పించిన ఘనత వీరనారి అయిలమ్మ దేనని కొనియాడారు.ఐలమ్మ పోరాట ఫలితంగానే తెలంగాణలో భూసంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు.ఐలమ్మను యువతి,యువకులు,మహిళలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.బావ సరుప్యత కలిగిన,ప్రజాతంత్ర వాదులు,లౌకిక వాదులు, అభ్యుదయవాదులు,అందరూ చాకలి ఐలమ్మ విగ్రహానికి ఏర్పాటుకు తోడ్పాటు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాళ్లూరి సాయి, సీపీఎం మండల కార్యదర్శి సిరికొండ శ్రీను,పట్టణ కార్యదర్శి నాగేష్, జనసేనా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సరి కొప్పుల నాగేశ్వర రావు,బిజెపి నాయకులు బాల వెంకటేశ్వర్లు,బీఎస్పీ నాయకులు రాపోలు నవీన్,పుర ప్రముఖులు ఆకారపు వెంకటేశ్వర్లు, ఇంజమూరి రాములు,మల్లయ్య,వెంకన్న,రజక సంఘ నాయకులు చిలక రాజు శ్రీను,లక్ష్మయ్య,బిక్షం వెంకట్, తిరుపతమ్మ,వినయ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.