చాకలి ఐలమ్మ 37వ వర్ధంతికి ఘన నివాళులు
టేకులపల్లి, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సిపిఐ టేకులపల్లి మండల సమితి ఆధ్వర్యంలో శనివారం టేకులపల్లి లో ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ భద్రాద్రి జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ రామచందర్ మాట్లాడుతూ నిజాం నిరకుషత్వం రాజ్యమేలుతున్న కాలంలో తెలంగాణలో ఆనాటి సామాజిక పరిస్థితులు అత్యంత దుర్భారంగా ఉండేవి. అణగారిన వర్గాల ప్రజలు దొరలు, భూస్వాములు, పటేల్ ,పట్వారిలకు భయపడుతూ బిక్కుబిక్కు మంటూ దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఆమె పోరాట పటిమను ఎంతో శృతి దాయకమని రామ్ చందర్ అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, అనగారిన వర్గాల కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారని, ఆ పోరాట శృతి తో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు ఎజ్జు భాస్కర్ ,గుగులోత్ శ్రీను, వాసం భద్రయ్య, అయిత శ్రీరాములు, బానోత్ వీరన్న, సుందర్ పాల్, లక్ష్మణ్, రవీందర్ ,మధు ,సతీష్ ,సోనీ ,విజయలక్ష్మి, విజయమ్మ ,భారతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.