చార్మినార్‌ను చక్కటి ప్రాంతం చేస్తాం

2

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): చార్మినార్‌ పరిసరాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ చేపట్టిన పాదచారుల పనులు పూర్తి చేసి  త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. ఇదో అద్భుత పర్యటకకేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. శుక్రవారం మంత్రి  చార్మినార్‌ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఆయన పర్యటించారు. చార్మినార్‌ వద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను 6 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం రూ.35కోట్లు కేటాయించిందని… అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. సర్దార్‌ మహల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని తరలించి ఫుడ్‌కోర్ట్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో పారిశుభ్రత, ప్రజా వసతులను మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈమేరకు ఇవాళ ఇరువురు కలిసి పాతబస్తీలో కలియ తిరిగారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. చార్మినార్‌ పరిసరాలను పర్యాటకులు ఆకర్షించేలా తీర్చిదిద్దు తామన్నారు. కాలుష్యరహిత బ్యాటరీ వాహనాలను ప్రవేశపెడుతామని వెల్లడించారు. సర్దార్‌ మహాల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని తరలించి ఫుడ్‌ కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. పాదాచారుల ప్రాజెక్టు కోసం రూ.35 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మరిన్ని నిధులు అవసరమైతే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని

స్పష్టం చేశారు. చార్మినార్‌ దగ్గర వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తామని, న్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డులను నిర్మిస్తామని  కేటీఆర్‌ పేర్కొన్నారు. చార్మినార్‌, నగర చరిత్రను తెలిపే ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాటరీతో నడిచే వాహనాలను అందుబాటులో ఉంచుతామని, ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామని  కేటీఆర్‌ వివరించారు.