చావెజ్‌ దృఢమైన సామ్రాజ్యవాద వ్యతిరేకి


చావెజ్‌ అవలంబించిన విధానాలనూ, వాటిపై వచ్చిన అభిప్రాయాలనూ, విమర్శలనూ విశ్లేషిస్తూ, ఆ విధానాలు సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలుగానే చూడాలని అంటున్నారు జి సత్యనారాయణ రెడ్డి

ఇటీవల మరణించిన వెనిజులా దేశాధ్యక్షుడు హ్యూగో చావెజ్‌పైన ప్రపంచ వ్యప్తంగా విభిన్నమైన, పరస్పర విరుద్దమైన అంచనాలతో కూడిన కథనాలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఆయన అనుసరిం చిన విధానాలను మార్క్సిస్టు – లెనినిస్టు దృక్కోణంలో ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఏ విధంగా విశ్లేషించడం సరైనదిగా ఉంటుంది? అనే దానికి ముందుగా ఆయనపై వ్యక్తమవుతున్న వివిధ అభిప్రాయాల గురించి క్లుప్తంగానైనా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. స్థూలంగా వాటిని అతి అంచనాలు, మిత అంచనాలు, తప్పుడు అంచనాలుగా పెర్కొనవచ్చు.

అతి అంచనాలు

ఆయన ఒక అసాధారణ కమ్యూనిస్టు అని, ‘దక్షిణ అమెరికాలో రాలిన ఎర్రసూరీడు’ అని అభివర్ణించడం, అలాంటి ఇతర అభిప్రాయాలు ఈ కోవకు చెందుతాయి. తాను కమ్యూనిస్టును కాదనీ, మార్క్సిజం తమ దేశానికి వర్తించదనీ, దక్షిణ అమెరికాను స్పెయిన్‌ వలస పాలన నుండి విముక్తి చేసిన సమైన్‌ బొలివర్‌ (1783-1830)తనకు ఆదర్వమనీ, ఆ అభిప్రాయాల ప్రకారమే, వాటి సాధన కోసమే తాను కృషి చేస్తాననీ కూడా ఆయన ఎలాంటి అస్పష్టతకు తావు లేకుండా ప్రకటించాడు. చివరి వరకు దాని క్సమే పాటు పడ్డాడు. అంత స్పష్టంగా తన అభిప్రాయాలను ప్రకటించాక కూడా ఆయనను, ఒక కమ్యూనిస్టుగా పేర్కొనడం అనేది పూర్తిగా స్వీయ మానసిక తత్వంతో కూడిన, చేసిన అంచనాగానే పేర్కొనవలసి ఉంటుంది.

మిత అంచనాలు

‘చావెజ్‌ ఒక అసమగ్ర, అభివృద్ది నిరోధక, అశాస్త్రీయ భావాలతో కూడిన కొంత మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నించిన ఒక మామూలు సంస్కరణల వాది మాత్రమే’ ననేది మరో అభిప్రాయం. ఇది ఆయన నిర్వహించిన పాత్రను పూర్తిగా తగ్గించి చూపడం మాత్రమే అవుతుంది. ఈ అభిప్రాయాలు కలవారు ఆయన మతపరమైన విశ్వాసాలను, ఆయనలోని ఇతర అశాస్త్రీయమైన అభిప్రాయాలనే ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఆయన నిర్వహించిన, ప్రాముఖ్యతగల సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్రత్యేకించి అమెరికన్‌ అగ్రరాజ్య వ్యతిరేక పాత్రను, దాని కోసం అతను సల్పిన పోరాటాన్ని వారు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆ విధంగా చేయడం ఆయన పాత్రను తగ్గించడంతో పాటుగా వక్రీకరించడమే అవుతుంది.

తప్పుడు అభిప్రాయాలు

ఆయనొక సోషల్‌ ఫాసిస్టనీ, ఆయన ప్రకటించని సోషలిజం, సామ్రాజ్యవాద వ్యతిరేకతలు కేవలం ముసుగులు మాత్రమేననీ, ఆయన అనుసరించిన సంస్కరణ వాదం చాలా ప్రమాదకరు మైనదనేది మూడో కోవకు చెందిన అభిప్రాయం. జర్మనీలో నాజీఉల తమను తాము నేషనల్‌ సోషలిస్టుంలమని పిలుచుకో ఒన్నట్లుగానే చావెజ్‌ బొలివారియన్‌ సోషలిస్టు అని పిలుపించు కొన్నాడనే వరకూ కూడా ఈ విమర్శలు విస్తరించాయి. మార్క్సి స్టు-లెనినిస్టులుగా-మావోయిస్టుటుగా చెప్పుకొనే వారిపై అభిప్రాయాలు చావెజ్‌ పాత్రలు వాస్తవంగా మార్క్సిస్టు – లెనినిస్టు దృక్పధంతో అంచనా వేయడం లేదు. అవి స్వీయ మానసికత త్వంతోనూ, దురభిప్రాయాలతోనూ ఏర్పరుచుకొన్న అంచనాలుగానే భావించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి, దేశాధినేత అమలు జరిపిన విధానాలపూ భావాన్ని ఫలితాలను మొత్తంగా ఆయన ఆచరణన అంచానా కట్టడానికి రెండు కొలమానాలను ప్రనామాణికంగా తీసుకోవాలి. సామ్రాజ్యవాదం, ముఖ్యంగా అమెరికన్‌ అగ్రరాజ్యం, దేశంలోని దోపిడీ వర్గాలు ఒక పక్క, మరోపక్క దేశ ప్రజలు చావెజ్‌పైన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసారు? వారు వివిధ క్లిష్ట సందర్బాల్లో ఏమి చేసారు? ఏ విధంగా స్పందించారు? అనేవే ఆ రెండు కొలమానాలు. ఈ కొలమానాలన ప్రనాతిపదికగా చేసుకొని వెనిజులాలలోని గత పద్నాలుగు సంవత్సరాల పరిణామాలను గనుక బేరీజు వేసుకొంటే చావెజ్‌పైన మార్క్సిస్టు లెనినిస్టులుగా చెప్పుకొంటున్నవారి పై అభిప్రాయాలు ఎంత తప్పో స్పష్టమవుతుంది.

చావెజ్‌ సోషల్‌ ఫాసిస్టు అనడం ఎట్లా చెల్లుబాటవుతుంది?

ఈ కింద పేర్కొన్న వాస్తవాలు ఈ అభిప్రాయం ఏ విధంగా తప్పో స్పష్టం చేస్తాయి.

1)దేశానికి నూతన రాజ్యాంగం అవసరమా కాదా అనే దానిపైన చావెజ్‌ ప్రజాభిప్రాయ సేకరణను (రెఫరెండం) జరిపించాడు. దేశ ప్రజల్లో 72 శాతం మంది అది అవసరమేననే తప్పు అభిప్రాయంగా దాన్లో స్పష్టం చేశారు.

2) ఆ వెను వెంటనే రాజ్యాంగ సబ ఏర్పాటుకై చావెజ్‌ ఎన్నికలు జరిపించాడు. చావెజ్‌, ఆయన మిత్రపక్షాల వారు పోటీ చేసిన వాటిలో 95 శాతం స్థానాలన గెలుచుకొన్నారు.

3) అధ్యక్షుడిని వెనక్కి పిలిపించే హక్కు (రీకాల్‌ హక్కు)ను కూడా పొందుపరుస్తూ 1999లో 350 అధికరణలతో కూడిన ఒక నూతన రాజ్యాంగాన్ని దేశానికి అందించాడు చావెజ్‌.

4) ఆ రాజ్యంగం ప్రకారం వెంటనే తిరిగి ఎన్నికలు జరిపించాడు (జూలై 30, 2000), ఆ ఎన్నికల్లో ఆయన కూటమి 2/3వంతు స్థానాలను గెలుచుకుంది.

5)నిరంకుశ కార్మిక నాయకులను అదుపులోష్ట్ర& పెట్టే లక్ష్యంతో కార్మిక సంఘాలకు చట్టబద్దంగా ఎన్నికలు జరగాలన్న నిబంధనలను రూపొందించి వాటిన అమలు జరిపించాడు. తద్వార ట్రేడ్‌ యూనియన్‌ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాడు.

చావెజ్‌ కమ్యూనిస్టు కాడనేది నిర్వవాదాంశం. అందువలన పైన చర్యలన్నీ సోషలిస్టు ప్రజాస్వామ్యంలోనో, నూతన ప్రజాస్వామ్యంలోనో నూతన ప్రజాస్వామ్యంలోనో ఒకక భాగం కావనేది స్పష్టమే ఆయన అమలు జరిపిన పైన పేర్కొన్న అయిదు ముఖ్యమైన చర్యలన్నీ బూర్జువా ప్రజాస్వామ్య పరిధిలోనివే అయినా వాటికి కచ్చితమైన ప్రజాస్వామిక స్వభావం ఉంది. రీకాల్‌ హక్కును (అధ్యక్షుడిని వెనక్కి పిలిచే హక్కు) రాజాంగంలో చేర్చడమే గాకుండా తన ప్రత్యర్థులను సుమాటే అఏశ్రీనే స్వచ్యంద సంస్థ పేరుతో తన రికాల్‌కు డిమాండ్‌ చేస్తే, దానిపైన చావెజ్‌ ఎన్నికలు నిర్వహించారు. చావెజ్‌ను దించి వేయవద్దనీ, ఆయనే అద్యక్షుడిగా కొనసాగాలనీ ఆ ఓటింగ్‌లో పాలొఇ్గన్న 59 శాతం మంది ప్రజలు కోరారు. ఆ ఎన్నికను అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్‌ నేతృత్వంలోని సంస్థ న్యాయమైనదిగా ప్రకటించింది. చావెజ్‌ పైన పేర్కొన్న విధంగా స్పష్టమైన ప్రజాస్వామిక విధానాలను అమలు జరపగా, ఆయన్ను ఒక సోషల్‌ ఫాసిస్టుగా పేర్కొనడం వాస్తవాలకు విరుద్దమైన ఒక వ్యతిరేక ప్రతికూల (నెగిటివ్‌) అబిప్రాయమనేది స్పష్టం.