చావెజ్‌ దృఢమైన సామ్రాజ్యవాద వ్యతిరేకి

చావెజ్‌ అవలంబించిన విధానాలనూ, వాటిపై వచ్చిన అభిప్రాయాలనూ, విమర్శలనూ విశ్లేషిస్తూ, ఆ విధానాలు సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలుగానే చూడాలని అంటున్నారు జి సత్యనారాయణ రెడ్డి
చావేజ్‌తో పాటుగా లాటిన్‌అమెరికా దేశల్లోని మరికొందరు దేశాధ్యక్షులు ‘పింక్‌ విప్లవం’ పేరుతో అనుసరిస్తున్న విధానాలను ఏ వధంగా, ఏ దృక్పధంతో అర్థం చేసుకోవాలి? మావో రూపొందించిన మూడు ప్రపంచాల సిద్దాంతం వెలుగులో మాత్రమే ఈ పరిణామాన్ని సరిగానూ, శాస్త్రీయంగానూ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ మూడు ప్రపంచాల సిద్దాంతం అంటే ఏమిటి? దాని సారాంశం ఏమిటి? 1974 ఫిబ్రవరిలో ఒక మూడవ ప్రపంచ దేశానికి చెందని నాయకునితో మట్లాడుతూ మొదటిసారి మావొ దాని గురించి ఈ కింది విధంగా విరించాడు.
ప్రపంచంలోని దేశాలను మూడు కేటరిదీలుగా వదిభజించాలి. అమెరికా, సోవియట్‌ యూనియన్‌లను మొదటి ప్రపంచం గానూ, జపాన్‌, ఐరోపా, కెనడా దేశాలను రెండవ ప్రపంచంగానూ, జపాన్‌ మినహా అన్ని దేశాలను మూడం ప్రపంచంగానూ ఆయన పేర్కొ న్నాడు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్రరాజ్యాలైన అమె రికా, సోవియట్‌ యూనియన్‌లకు వ్యతిరేకంగా మూడవ ప్రపంచ దేవలు ప్రధానమైన శక్తిగా, రెండవ ప్రపంచ దేశాలను కూడా కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఒక విశాలమైన ఐఖ్యసంఘటన నిర్మాణానికి పూనుకోవాలి, కృషి చేయాలి. ఆ విధదంగా సాగే అగ్రరాజ్య వ్యతిరేక పోరాటం, అగ్రరాజ్యాలను తద్వారా మొత్తంగా సామ్రాజ్యవాదాన్ని బాగా బలహీనపరుస్తుంది. అది ప్రపంచంలో విప్లవాన్ని ముందుకు తోసుకు వెళ్లడంతో సానుకూలమైన పాత్రను నిర్వహిస్తుంది. ఇదీ ఆ సిద్దాంతపు సారాంశం.
ప్రపంచాన్ని పై విధంగా విభజించే సిద్దాంతం ద్వారా మావో నేటి ప్రపంచ భౌతిక వాస్తవలను మార్క్సిస్టు-లెనినిస్టు దృక్పథంతో మదింపు చేసాడనేది స్పష్టమే. ఆ తర్వాత మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్య, యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రాతిపదికపైన ఐక్య సంఘటన ఏర్పాటుకు ఈ సిద్దాంతం ఒక శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అమెరి కాకు వ్యతిరేకంగా ప్రపంచంలోని దేశాలన్నింటినీ ఐక్యం చేసే ఎత్తుగ డలను అనుసరించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే బలహీన పడుతున్న అమెరికా అగ్రరాజ్యం రానున్న రోజుల్లో మరింతగానూ, మరింత వేగంగానూ బలహీన పడుతుంది. సామ్రాజ్యవాదానికి నాయకుడిగా ఉంటున్న అమెరికా అగ్రరాజ్యం బలహనపడింది అంటే మొత్తంగా సామ్రాజ్యవాదమే బలహీనపడడం అవుతుంది. ఈ సరిస్థితుల్లో మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ శక్తులతో పాటుగా, మూడవ ప్రపంచ దేశాలు, ఆయా దేశాల్లోని ఇతర స్వతంత్ర శక్తులు(పోర్సెస్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌) బాగా అభివృద్ది చెందిటవ బలపడడానికి అది తొడ్పడుతుంది. వెనిజులాలో, దక్షిణ అమెరికా ఖండంలో, మొత్తంగా ప్రపంచంలోని పరిణామాలను మనం ఈ వెలుగులోనే అర్ధం చేసుకోవలసిని అవసరం ఉంది.
ఈ దృక్కోణం నుండి కాకుండాచావెజ్‌కు మ త విశ్వా సాలున్నాయనీ, ఆయనొక సంస్కరణవాదనే కోణాల్లో ఆలోచించ ేవారు, అంచానా కట్టేవారు రాజకీయంగా తప్పు చేస్తున్నట్లుగా భావిం చాల్సి ఉంటుందనేది స్పష్టమే. ఈ కింద పేర్కొన్న విషయం దానినే మరింత బలపరుస్తుంది.
‘కార్మికవర్గఒస్త్రం తప్పనిసరిగా పీడదిటవత జాతులతో సమైక్యం కావాలనే లెనిన్‌ సూత్రీకరణను స్టాలిన్‌ కొనసాగిస్తూ వచ్చాడు. జాతీయ విముక్తి యుద్దంలో వాటి పరిస్థితి, రాజకీయ దృక్పధాలు వేరు గా ఉన్నప్పటికీ, సామ్రాజ్యవాద దురామ్రాలను వ్యతిరేకించే అన్ని శక్తులను కలుపుకురావాలని ఆయన (స్టాలిన్‌) సూచించాడు. అప్ఘనిస్తాన్‌కు చెందని అమీర్‌ స్వదేశంలో రాజరిక వ్యవస్ధనే అంట ిపెట్టుకొన్నప్పటికీ, ఈజిప్టు జాతీయోద్యమ నాయకులు బూర్జువా వర్గానికి చెందిన వారు సోషలిస్టు వ్యతిరేకులయినప్పటికీ ఆ దేశాల స్వాతంత్య్రం కోసం వారు సాగిస్తున్న పోరాటాలు విప్లవ పోరాటాలే. ఎందుకంటే అవి సామ్రాజ్యవాదాన్ని బలహీనపరిచి, నాశనం చెయ్యడానికి ఉపయోగపడ్డాయి’ మావో మూడు ప్రపంచాల సిద్దాంతంపై ‘పీపుల్స్‌ డైలీ’ సంపాదకీయం, 31 అక్టోబర్‌ 1977.
మావో ఆ తర్వాత కాలంలో మూడు ప్రపంచాల విభజనను ఒక సమగ్రమయిన సిద్దాంత స్థాయికి అభివృద్ది చేసినప్పటికీ లెనిన్‌, స్టాలిన్‌లు అంతకు ముందే మౌలికంగా ఆ దృక్పధాన్నే కలిగి ఉన్నా రనీ, ఆ వైఖరితోనే ప్రపంచంలోని వివిధ పరిణామాలను విశ్లేషించారనీ పై పేరాలో పేర్కొన్న విసయం స్పష్టం చేస్తుంది. ఆయా దేశాల్లోని సాంఘీక వ్యవస్థలు రాజరికాలయినా, బూర్జువా పాలనలో ఉన్నాకూడా సామ్రాజ్యవాదానికి, ప్రత్యేకించి అగ్రరాజ్య ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా అవి నిర్వహించే పాత్రేశ్రీను బట్టి వాటిని అంచనా కట్టాలనేదే పై వివరణ సారాంశం. ఆ ప్రాతిపదికపై ఆలోచించినప్పుడు చావెజ్‌ రోమన్‌ కాథలిక్కనీ, ఆయనకు మతప రమైన విశ్వాసాలు ఉండడాన్ని పక్కనబెట్టి, ఆయన నిర్వహించిన అమెరికా అగ్రరాజ్య వ్యతిరేక పాత్రనే ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
సామ్రాజ్యవాదుల, దేశంలోని వారి దళారుల, భూస్వాముల ప్రాబల్యం తగ్గించడం కోసం చావెజ్‌ 2001, 2002 సంత్సరాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకొని, వాటి అమలు కోసం చర్యలు చేపట్టాడు. చమురు స్వాధీనం, భూసంస్కరణలు, అనేక ఇతర సంక్షేమ చర్యల ద్వారా ప్రజల జీవన స్ధాయిని గణనీయంగా ఆయన మెరుగు పరిచాడు. ప్రభుత్వ వ్యయంతో విద్య, వైద్య, సౌకర్యాలను విస్తరింప జేసాడు. యూనివర్సిటీ స్థాయి వరకూ ఉచిత విద్య సౌకర్యాన్ని కలిగించాడు.
చావెజ్‌పై అంచనాకు ముఖ్యమైన రెండు కొలమా దేశంలోని దోపిడీ వర్గాలు, సామ్రాజ్యవాదులు ఒకవైపు, ఆ దేశ ప్రజలు రెండవ వైపు తీసుకొనే వైఖరులన బట్టి ఆ ప్రభుత్వంపైనా, దాని నాయకుడిపైనా మౌళికంగా ఒక అంచానకు రావచ్చును. చావెజ్‌ దేశంలోని దోపడీ వర్గాలకు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వరసగా అనేక చర్యలు చేపట్టాడు. వాటి మూలంగా తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతోనే చావెజ్‌ను ఆ వర్గాలన్నీ కుట్రపన్ని 2002, ఏప్రిల్‌ 9న అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఒక వెల్లువలా కదిలి వీధుల్లోకి వచ్చారు. వారితోపాటుగా, చావెజ్‌ అనుకూలురైన సైన్యంలోని ఒక భాగం ఆయన్ను జైలు నుండి విడిపంచి అద్యక్ష భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోన్నారు. ప్రపంచ చరిత్రలో ఇది ఒక అరుదైన, అసాధారణమైన సంఘటన. వివిధ దేశాల్లో చావెజ్‌ టాంటి వారు అనేక మంద అంతకు ము9దు కూడా ముందుకు వచ్చారు. నాజర్‌, సుకర్ణో, అలెండి, గడాఫి అలాంటి వరిలో కొందరు మాత్రమే. వారిలో అత్యధికులను ఆ దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదుల సహాయ, సహకారాలతో చంపివేయగలిగారు. చావెజ్‌ను కూడా చంపాలనే దోపిడీ శక్తులు నిర్ణయించుకున్నాయి. కానీ ఆ ప్రయత్నంలో వారు విఫలమయ్యాయి. చావెజ్‌ అనుసరించిన విధానాలు వారిని ఆ ప్రయత్నంలో విఫలం చేసాయి. తన పద్నాలుగు సంవత్సరాల పాలన కాలంలో జరిగిన నాలుగు ఎన్నికల్లో చావెజ్‌ 53 శాతం నుండి 66 శాతం దాకా ఓట్లు పొందగలిగాడు. వీటన్నిటి పరాకాష్టగా ప్రజలు, సైన్యం ఆయన ప్రాణాలను కాపాడువోగలగడం ప్రాముఖ్యత గల విషయం, చావెజ్‌ ప్రజా అనకూల, దేశ అనుకూల సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని దీనిని బట్టే అంచనా కట్టవచ్చును.
వెనిజుల, దక్షిణ అమెరికాతో పాటు నేటి ప్రపంచ పరిణామాలను గమనిస్తే మూడవ ప్రపంచ దేశాలు, సామ్రాజ్యవాదులను, అగ్రరాజ్య ఆధిపత్యాన్ని చూసి ఇంకెంత మాత్రం భయపడడం లేదు. మూడవ ప్రపంచ దేశాలను చూసి సామ్రాజ్యవాదులు, అమెరికా అగ్రరాజ్యమే భయపడుతున్నాయి. ఇది నేటి ప్రపంచపు ప్రాధమిక చారిత్రక ధోరణిగా స్పష్టంగా కనిపిస్తున్న ఒక భౌతిక వాస్తవం.
ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యుద్దాల్లో పీకలదాకా దిగబడిపోయిన అమెరికా అగ్రరాజ్యం ఆర్థికంగానూ, ఇతర విధాలుగానూ, బాగా దెబ్బతిన్నది, బలహీనపడింది. ఇంకా పడుతున్నది. అంతకు పూర్వమే రష్కన్‌ అగ్రరాజ్యం దెబ్బతిని పోయి బాగా బలహీనపడింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, జపాన్‌ సామ్రాజ్యవాద దేశాలు బాగా దెబ్బతిని పోయాయి. పై దేశాలన్నీ తమ ఆర్థిక ప్రయోజనాల పరి రక్షణ కోసం అమెరికా అగ్ర రాజ్యంతో పోటీ పడుతున్నాయి. (కొన్ని సందర్బాల్లో అవి, అమెరికాతో కుమ్మక్కు అవుతున్నప్పటికీ వాటి మధ్య పోటీనే ప్రధానమైన విషయంగా ఉంటున్నది). మరోపక్క జన చైనా అన్ని విధాలుగా ముందుకు దూసుకొని వచ్చింది. మూడవ ప్రపంచ దేశాలకు అది నిజమైన మిత్రుడుగా, అమెరికా అగ్రరాజ్యా నికి ఒక బలమైన సవాలుగా నిలుస్తోంది. బలహీన పడిన అగ్రరా జ్యంగా రష్యా తన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అమెరిక ాతో పోటీ పడుతోంది. ఈ విధంగా అన్ని వైపుల నుంచి చుట్టి వేయబడిన అమెరికా అగ్రరాజ్యం ప్రపంచంపై తన ప్రాబల్యాన్ని, పట్టును రోజు రోజుకూ మరింతగా కోల్పోతూ ఒంటరైపోతోంది. ఈ క్రమం రాబోవు కాలంలో మరింత బలపడుతూందే తప్ప బలహీన పడదు. ‘1930, 40ల నాటికి తూర్పు దేశాల అధిక్యతను అంగీ కరించడానికి పశ్చిమ దేశాలు సంసిద్దంగా ఉండాలని కొద్ది సంవత్సరాల క్రితం ప్రపంచబ్యాంకు మాజీ అధ్యక్షుడు ఉల్ఫెన్‌సన్‌ ప్రకటించాడు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు ఆ వైపుగానే సాగుతున్నాయనేది ఒక తీరుగులేని వాస్తవం.
బలహీనపడుతున్న సామ్రాజ్యవాదం – అమెరికా అగ్రరాజ్యం
ఈ పరిస్ధితుల్లో అనేక మూడవ ప్రపంచ దేశాలు మరింతగా స్వాతంత్య్రాన్ని ప్రదర్శించగలుగుతాయి. అన్ని విధాలుగా మరింతగా నిలదొక్కుకోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. వరసగా సంభవించే ఇలాంటి ఆర్థిక, రాజకీయ మార్పులు ఆయా దేశాల్లోని వనరులను జాతీయ శక్తులన తమ చేతుల్లోకి తీసుకొనే క్రమం మరింత బలపడుతోంది. ఒకప్పుడు శాసించగలిగిన స్థితిలో ఉన్న విదేశీ గుత్త సంస్థలు తమ ప్రాబల్యాన్ని ఒకటి తర్వాత ఒకటి ఒదులుకొవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదంతా కూడా జనరల్‌గా సామ్రాజ్యవాదం, ప్రత్యేకించి అమెరికా అగ్రరాజ్యం మరింతగా బలహీనపడడానికి, దెబ్బ తినిపోడానికి సానుకూలమైన నేపధ్యాన్ని సమకూర్చడానికి తోడ్పడుతుందనేది స్పష్టమే.
భారతదేశం కూడా మూడవ ప్రపంచానికే చెందిన దేశం. అయితే భారత పాలకులు మాత్రం సామ్రాజ్యవాదులకు కల్తిలేని దళారులుగా ఉంటూ వస్తున్నారు. ప్రపంచంపై ఆధిపత్యం నిలుపుకోవడానికిటవ ప్రయత్నిస్తున్న అమెరికా అగ్రరాజ్యం విదానాలతో వారు పీఠముడి వేసుకొని దానిలో భాగం కోసం, ప్రాంతీయ ఆధిపత్యం కోసం చుట్టుపక్క దేశాలపై పెత్తనం కోసం పాకులాడుతున్నారు. అందువలనన ఈ పరిణామంతో భారత పాలకుల పాత్ర పూర్తిగా ప్రతికూలం (నెగెటివ్‌) గానే ఉంటుంది. భారతదేశంలోని కమ్యూనిస్టు విప్లవకారులూ, స్వాతంత్య్ర శక్తులూ, దేశభక్తి కలవారందరూ కూడా భారత పాలకుల అమెరికా అగ్రరాజ్య అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలి. అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే కృషిలో వారు తమ వంతు పాత్రను నిర్వహించడానికి మరింతగానడుం బిగించాలి. హ్యూగో చావెజ్‌ కృషి ఆచరణ నుండి వారు అలాంటి స్పూర్తిని పొందాలి.