చిత్తశుద్ధితో పరిష్కరించ కుంటే
9 నుండి నిరవధిక సమ్మె తప్పదు
–జేఏసీ నేతల హెచ్చరిక
టేకులపల్లి, సెప్టెంబర్ 6( జనం సాక్షి ): సింగరేణి యాజమాన్యం సంస్థలో పనిచేస్తున్న 30వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా మొండివైఖరిని అనుసరిస్తున్నదని,కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు డి.ప్రసాద్,నోముల భానుచందర్, ఎం.మళ్లీ కార్జూన్ రావు, నర్సింహా రావు,కోటి లింగం అన్నారు. ఈ నెల 9 నుండి జేఏసీ ఆధ్వర్యంలో జరిగే కాంట్రాక్టు కార్మికుల సమ్మె నోటీసును కే ఓ సి ప్రాజెక్టు అధికారి, ఎస్ వి ఈ సి మేనేజర్,సర్ఫేస్ మైనర్ మేనేజర్ లకు కార్మిక సంఘాల నాయకులు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో కేంద్ర కార్మికశాఖ అధికారుల వద్ద 2 నెలల్లో డిమాండ్ల పరిష్కారం చేస్తామని అంగీకరించారని తెలిపారు. తమ హామీని 7 నెలలుగా అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో సింగరేణి యాజమాన్యం ఆడుకుంటున్నదని విమర్శించారు.
కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9 నుండి 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి సంస్థలో నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన జేఏసీ నాయకులు తెలిపారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధితో 2013 నుండి చెల్లించాల్సిన హైపవర్ కమిటీ వేతనాల ఏరియర్స్ ను చెల్లించాలని, సంస్థ లాభాలలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఉన్నందున బోనస్ చెల్లించాలని, సమానపనికి సమానవేతనాన్ని ఇవ్వాలని లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీప్రకారం అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని తదితర డిమాండ్లను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు యాజ�