చిల్లెపల్లి ప్రాథమిక సహకార సంఘం పై వచ్చిన ఆరోపణలు వెంటనే విచారణ చేపట్టాలి

 

 

 

 

నేరేడుచర్ల( జనం సాక్షి) న్యూస్. మండలం పరిధిలోని చిల్లెపల్లి ప్రాథమిక సహకార సంఘం పై వచ్చిన ఆరోపణలకు సంబంధింత అధికారులు వెంటనే విచారణ జరిపి దోషులను ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు, కొదమగుండ్ల నగేష్ డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక అరిబండి భవన్లో జరిగిన సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ చిల్లెపల్లి సహకార సంఘంకు ఎలాంటి సంబంధం లేని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్య గూడెం గ్రామానికి చెందిన రైతు పేరుతో ధాన్యం కొనుగోలు చేసినట్లు వారి అకౌంట్ లోకి డబ్బులు వేయించి,మళ్ళీ తిరిగి చిల్లపల్లి సొసైటీ వారు తమ అకౌంట్లో డబ్బులు కోట్టించుకున్నరనె ఆరోపణలు వస్తున్నందున వెంటనే సంబంధిత అధికారులు విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని అన్నారు.సొసైటీలో సుమారు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని,ఆంధ్ర నుండి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత మిల్లర్లకు దింపి కనీస మద్దతు ధర రూ. 1900/- ప్రకారం బిల్ చేయించినట్లు వస్తున్న ఆరోపణలకు వల్ల ఈ ప్రాంత రైతాంగం ఆందోళన చెందుతున్నారని,రైతులకు సహకారం చేయవలసిన సొసైటీలు రైతుల పేరుతో భారీ కుంభకోణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు నీలా రామ్మూర్తి, కుంకు తిరుపతయ్య, పాలకీడు పీఏసీఎస్ డైరెక్టర్ పాతూరు శ్రీనివాసరావు,కొండపల్లి వరలక్ష్మి,శ్రీను,ఎస్కే రంజాన్ కోదాటి సైదులు గుర్రం ఏసు తదితరులు పాల్గొన్నారు.