ఛత్తీస్‌గడ్ పెట్టుబడులు-అభివృద్ధి బూటకం
గత పది సంవత్సరాలుగా మండేర్ (రాయ్‌పూర్) అకల్‌తరా(జాంజ్‌గిరి)లోని సిపిఐ కింద ఉన్న సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి. కేంద్రం వాటిని ఇప్పుడు అమ్మివేయాలని చూస్తున్నది. ఈ మూతపడ్డ కంపెనీలు తిరిగి తెరుచుకునేలా తగిన నిధులను సమకూర్చి, వీధినపడ్డ కార్మికులకను ఆదుకోవాచ్చు గదా! కానీ, అలా జరగడం లేదు. రమణ్ సింగ్ ప్రభుత్వానికి ఏ మాత్రం నిజాయితీ లేదనేది తెలుస్తూనే ఉంది. బైలదిల్లా గనుల నుండి వెలికి తీస్తున్న ఐరన్ ఓర్‌కి రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు సప్లయి అయ్యేలా రమణ్ సింగ్ ఏ మాత్రం చొరవ చూపడం లేదు. కొరబా గనుల నుండి తీసే ముడి సరుకులో తమకు 50 శాతం కేటాయించాలని రాష్ట్రం స్పాంజ్ ఐరన్ పరిశ్రమల అసోషియేషన్ అధ్యక్షుడు అనిల్ నాచ్ రాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవానికి బౌలదిల్లా నుండి ఆత్పత్తి అవుతున్న ముడిసరుకు మొదటిగా రాష్ట్ర పరిశ్రమలకు అందించిన తరు వాతనే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేది న్యాయసమ్మతమైన విషయం కాని, బడా కార్పొరే ట్ కంపెనీలకు దాసోహం అయిన రమణ్‌సింగ్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అంత కంటే ఎక్కువ ఆశించడం కూడా మన తప్పే అవు తుంది. రమణ్‌సింగ్ ప్రభుత్వం అభివృద్ది, పరిశ్ర మలు, పెట్టుబడులు అన్నీ వట్టి నీటి బుడగలేనని తెలిసిపోయింది.గతంలో కోర్ సెక్టారులలో పెట్టు బడులను అనుమతించడం ద్వారా రాష్రంలో ఉ ద్యోగవకాశాలు మెరుగు పడతాయనుకున్నారు. కాని, ప్రభుత్వం ప్రచారం చేసినట్టుగా జరగలేదు. బడా కంపెనీలు ఖనిజ తవ్వకాలలో మానవ శ్రమకు బదులు పెద్ద ఎత్తున భారీ యంత్రాలతో పనులు చేస్తూ లాభాన్వేషనలో అనుకన్నదానికన్న ముందుగానే ఖనిజాన్ని స్వాహా చేస్తున్నారు. లోప భూయిష్టమైన ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రజ లను కనీసం మైనింగ్ పనుల్లో చివరకు కూలీ అ యినా దక్కకుండా పోయింది. ఈ గ్లోబల్ ఇన్వె స్టర్స్ మీట్ సందర్భంగా ఐటి, ఆటోమోబైల్ రంగా లకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఐటి రంగంలో పెట్టుబడులు ఆశించిన విధంగా రాలేదు. బెంగుళూరులోని డెలీ మాట్రిక్స్ సంస్థ మాత్రం రు. 13.5 కోట్లు పెట్టడానికి సిద్ద పడింది. ప్రస్తుతం ఐటి రంగంలో కూడా మందగమనం మొదలైన సూచనలు కనబడు తున్నాయి. ఐటి పరిశ్రమ తక్కువ సంఖ్యలో ఉన్న ఉన్నత వర్గనికి మాత్రమే ఉపమోగపడుతుంది. సర్వీసు రంగం కంటే మాన్యుఫ్యాక్చరింగ్ రంగం లో పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద ఆద్యోగావకా శాలుంటాయి. భారతదేశం మొత్తంగానే వ్యవసా యిక రంగం అభివృద్ది సాధించకుండా, చత్తీస ్‌ఘడ్ రాష్ట్రం సమగ్ర అభివృద్దిని సాధించే మాటే లేదు.రాష్ట్ర అవతరణ జరిగి పన్నెండేళ్లయినా వ్యవ సాయం పట్ల రమణ్‌సింగ్ ప్రభుత్వం తీవ్ర నిర్ల క్ష్యం వహించింది. పైగా ఇప్పటికే చేసింది. చాల దన్నట్టుగా, వ్యవసాయంలో ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు సరిగా అమలు జరిగే విధంగా ఈ బాధ్యతలను కార్పొరేట్ సంస్దలకు ఇచ్చేందకు తయారీలు చేస్తు న్నది. రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతులున తమ వాకి ట్లోనే దోచుకునే పద్దతి. కార్పొరేట్ సంస్థలు తమ ధన బలంతో రైతుని నియంత్రించేందుకు అవ కాశం ఉంది. రైతు పొలంపై రైతుకు కాకుండా 50 శాతం సబ్సిడీని కార్పొరేట్ సంస్థలకే అంద జేస్తున్నది ప్రభుత్వం.చత్తీస్‌గడ్‌లోని గ్రామాల్లో రైతుల పరిస్ధితి దయనీయంగా తయారయింది. నీటి సౌకర్యం సరిగా లేకపోవడం , ఖర్చులు పెరి గిపోవడంతో వ్యవసాయం గిట్టుబాటు లేకుండా పోతున్నది. తీసుకున్న రుణాలు తీర్చలేక ఎంతో మంది రైతులు పంట పోలాల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రమణ్‌సింగ్ పాలించిన ఈ అయిదు సంవత్సరాల కాలంలోనే ఏడువేల మందికి పైగా రైతుఉ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యల్లో చత్తీస్‌గడ్ అయిదో స్థానంలో నిలిచింది. 2010లో ఒక సంత్సరంలోనే 1126 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు రికార్డయింది. కార్పొరేట్ కంపెనీలకు 24 గంటలు అందుబా టులో ఉంటానన్న రమణ్‌సింగ్‌కి రైతులు పడు తున్న కష్టాలు తలకెక్కడం లేదు. ఇది రమణ్‌సింగ్ కార్పొరేట్ బానిస బుద్ది. మండల సభ్యుడైన డాక్ట ర్ ఎంఎల్ అడిల్ రాయపూర్‌లో జరిగిన చత్తీస ్‌గడ్ పంచాయతీ మేళాలో మాట్లాడుతూ అన్నదాత గురించి అందరూ మాట్లాడుతారు కాని, చత్తీస్‌గడ్‌లోని ఇరవై వేల గ్రామాల్లోని ఓ అయిదు గ్రామ పంచాయతీలను వ్యవసాయ అభివృద్ది చెందిన ఆదర్శ గ్రామాలుగా చూపించమనండి’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. రాష్ట్రంలో నేటికి 65 శాతం ప్రజలు తమ తమ జీవనోపాధి కోసం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కొద్దిమందిగా ఉన& భూస్వాముల కుటుంబాల వద్దనే ఎక్కువ శాతం భూమి కేంద్రీకరించబడి ఉంది. 75 శాతంగా ఉన్న పేద, చిన్న మధ్యత రగతి రైతాంగం దగ్గర కేవలం 2 నుండి 5 ఎక రాల భూమి మాత్రమే ఉంది. నేటి స్థితిలో వీరం దరూ రైతుకూలీల స్థితికి దిగివచ్చారు. దాన్ కా కటోరిగా పేరు గాంచిన చత్తీస్‌గడ్ రైతాంగం రమణ్‌సింగ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురై బతులీడుస్తున్నారు. బ్రిటిష్ వారు దేశం విడిచి 65 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు జరగలేదు. రైతాంగానికి తగినంత భూమి దొరకనంత కాలం వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడం అసాధ్యం. తగినంత భూమి, నీటి వసతి, ఎరువుల లభ్యత లాంటివి రైతాంగానికి సులువుగా లభించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా తయారై రైతుకు వెసులుబాటు నిస్తుంది. తద్వారా మంచి పంటలు రావడం వల్ల రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాంతో సైకిళ్లు, సైకిల్ మోటార్లు, రేడియోలు, గడియారాలు, టివిలు, వంట పాత్రలు, బట్టలు, గృహ ఉపమోగ వస్తువులు, బల్బులు, వైర్లు లాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ , ప్రయాణాలకు ఉపయోగపడే జీపులు, బస్సులు, ట్రక్కులు, వ్యవసాయానికి ఉపయోగపడే పారలు, గడ్డపారలు, గొడ్డళ్లు లాంటి పనిముట్టతో సహా ట్రాక్టర్లు, ఎరువులు లాంటి కంపెనీలలో తయారయ్యే వస్తువుల డిమాండ్ కూడా పెరిగి పారిశ్రామిక అభివృద్ది తీవ్ర గతిన సాగుతుంది. తేయాకు, చక్కెర, నూలు, కాఫీ, సిగరేట్, బిస్కట్, ఇవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలే నూనే మిల్లులు, రైసు మిల్లులు, చేనేత వస్త్రాలు, బీడిలు లాంటి చిన్న కుటీర పరిశ్రమలకు కూడా వ్యవసాయం నుండే ముడిసరుకు సరఫరా అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రంగానికి కూడా వ్యవసాయమే ముఖ్య ఆధారం. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఎక్కువ శాతం వ్యవసాయ ఉత్పత్తులనే వివిధ ప్రాంతాలకు చేరవేయడం జరుగుతున్నది. దేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులతో 20 శాతం వరకు వ్యవసాయ రంగానికి చెందినవే. ఇలా క్రమానుగతంగా వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని పరిశ్రమ అభివృద్ది అనేది శీఘ్రగతిలో వృద్దిని సాధిస్తుంది. వ్యవసాయం వెనుకబడడంతో విద్య, వైద్య సేవలను అశేషమైన ప్రజానీకం వాటిని విరివిగా ఉపయోగించుకున అవకాశాలు లేకుండా పోయాయి. ఆ కారణంగా వాటి అభివృద్దిలో కరూడా మందగమనం కొనసాగుతోంది. ఆలోమోబైల్ రంగం కూడా అంతే అలాగాక కేవలం పెట్టుబడుల వల్ల ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళతామనడం రాష్ట్ర ప్రజలన మభ్యపెట్టడమే గ్లోబల్ మీట్ సందర్బంగా దిగిన పెట్టుబడుల వల్ల మల్టీ నేషనల్, బడా కార్పొరేట్ కంపెనీలకు, వారికి పేవచేసేఊ లేదా కమిషన్ కోసం పాకులాడే రాజకీయ నాయకులకు, ఉన్నతశ్రేణిలో అధికారులకు ప్రయోజనం తప్ప, రాష్ట్ర ప్రజలక ఒరిగే ప్రయోజనం మాత్రం శూన్యం.
ఇక్కడ మరో విషయం చర్చించాల్సి ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఈమ ప్రభుత్వం సాధించిన అభివృద్ది ఫలాలను గురించి వివరిస్తూ ‘ గర్వించాల్సిన విషమేమిటంటే చత్తీస్‌గడ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. అభివృద్దిలోని ప్రతి అడుగులో మా ముఖ్య ధ్యేయమేమిటంటే, అభివృద్ది లాభాలు మొట్టమొదటిగా సమాజంలోని ఆఖరి లైనులోని ఆఖరి మనిషి వరకు చేరడం. ఇప్పుడ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆదాయం రు.44,057కు పెరిగింది. ఇది మనందరం గర్వించాల్సిన విషయం’ అంటూ ఏదేదో వివరిస్తూపోయాడు.
వక్రమార్గంలో జరుగుతున్న అభివృద్ది వల్ల రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదు. పన్నెండేళ్లుగా వచ్చిన లాభాలన్నింటినీ ఒక వర్గం మాత్రమే చేజిక్కించుకున్నది. సాధారణ ప్రజలంతా మరింత పేదలయ్యారు. బస్తర్‌లోని ఆదివాసులు గత ఏడు సంవత్సరాలుగా సల్వాజుడుం, గ్రీన్‌హంట్ నిర్బంధకాండలో నలిగిపోతున్నారు. అభివృద్ది పేరుతో సాగే కార్పొరేట్ విధ్వంసక పదఘట్టనల కింద పడి ఆఖరి లైనులోని ఆఖరి మనిషి అయిన ఆదివాసి కూడా నలిగిపోకుండా తప్పించుకోలేకపోయాడు. దేశంలోని మూడింట ఒకవంతు జనాభా అంటే నలభై కోట్ల మంది ప్రజలు కడుపేదరికంతో బతుకులెల్లదీస్తుంటే, చత్తీస్‌గడ్‌లో సగటు మనిషి ఆదాయం పెరిగిందనేది ఒట్టి మోసం, దగా మాత్రమే. నేషనల్ నమూనా సర్వే లెక్కల ప్రకారం చత్తీస్‌గడ్‌లో నెలకు 780 రూపాయలు ఖర్చుపెడుతుంటే, టెండుల్కర్ కమిటి సర్వే ప్రకారం నెలకు 512 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే సంత్సరానికి 9,360 రూపాయలు లేదా, టెండుల్కర్ లెక్కల ప్రకారం 6,154 రూపాయలు సగం జనాభా ఖర్చు పెడుతుంటే, రమణ్‌సింగ్ ప్రభుత్వం చెబుతున్న విధంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయం 44,057 రూపాయలుగా ఎక్కడ పెరిగినట్టు, రాష్ట్రంలోని కడు పేదవాని 6,154 లేదా 9,360 రూపాయలతో అనిల్ అగ్రవాల్(వేదాంత) రమేశ్‌చంద్ర అగ్రవాల్, ఎస్సార్ ప్రశాంత్ రుయిమాల ఆదాయలతో కలిపి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయం ఈ పది సంవత్సరాలలో 10,375 నుండి 44,057 రూపాయలకు పెరిగిందంటే ఎవరు నమ్ముతారు. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకు చేసే గణాంకాలు, నిజానికి విషయాన్ని మరో కోణం నుండి చూస్తే రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయం 44,057 రూపాయలుగా పెరిగిన మాట వాస్తవమే. అయితే అది వారికి దక్కడం లేదు. బడా కంపెనీలు వాటిని కాజేస్తున్నాయి. సామాజిక ఉత్పత్తిలో అందరూ భాగస్వాములై సమిష్ఠిగా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అందుకని వాటి ఫలాలు అందరికి చెందాల్సిందే. అయితే అది ఎలా సాధించాలి అనేదే తేల్చుకోవాల్సిన విషయం.
తమ అభివృద్దిలో ఆదాయం పెరిగన విషయం వివరించాడు. కాని, ప్రజల పేరుతో ప్రభుత్వాలు చేసిన రుణం ఎంతుందో తెలపలేదు. చత్తీస్‌గడ్‌లోని ప్రతి వ్యక్తి రుణం 2010-11 లో 26,600ల రూపాయలుంటే, అది 2011-12 నాటికి 32,812 రూపాయలకు పెరిగింది. ఈ రుణాల్ని ప్రజలందరి పేరు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అంతర్జాతీయ అర్థిక సంస్థల నుండి, ప్రపంచ బ్యాంక్ నుండి తామే బాధ్యతపడి తీసుకున్నాయని, తిరిగి ఆ రుణాన్ని తీర్చే బాధ్యత ప్రజలందరి మీద ఉందని దాన్ని పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో తిరిగి చెల్లిస్తున్నాయని రమణ్‌సింగ్ చెబితే మరీ బావుండేది.