ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

2

– 12 మందికి గాయాలు

– ఒక జవాను మృతి

సుకుమా,మార్చి11(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మర్లగూడెం వద్ద శుక్రవారం ఉదయం మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ఓ జవాను మృతిచెందాడు. ఈ ఘటనలో రంగరాఘవన్‌ అనే జవాను తీవ్రంగా గాయపడగా… అతడిని హైదరాబాద్‌కు తరలించారు. ఇక్కడి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. సుకుమా జిల్లా మర్లగూడెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 12 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గామపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మర్లగూడెం వద్ద రహదారి పనుల్లో భద్రత నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరుకు 20 కిలోవిూటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.  తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల  సరిహద్దులోగల కుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ సంఘటనలో ఓ జవాన్‌ మృతిచెందాడు. తెలంగాణ రాష్ట్రంలోని చర్ల మండల కేంద్రానికి 30 కిలోవిూటర్ల దూరంలో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం… ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 9 మంది నక్సలైట్లు హతమవడంతో ప్రతీకారంతో రగిలిపోతున్న నక్సలైట్లు రోజుకో ఘటనకు పాల్పడుతున్నారు. తాజాగా జరిపిన మందుపాతర ఘటనలో వీరరాఘవన్‌ అనే జవాన్‌ తీవ్ర గాయాలకు గురవ్వగా ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ జవాన్‌ మృతిచెందాడు.  217 బేటాలియన్‌ కు చెందిన ప్రభాత్‌ త్రిపాటి, శ్రీనివాస్‌, రంగా రాఘవన్లు రోడ్డు మార్గమును తనిఖీ చేస్తుండగా ఒక్క సారిగా మందుపాతర పేలింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు. గాయపడిన వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు