ఛాయ్‌వాళాకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవు

4
– సోనియా గాంధీ

అస్సాం,మార్చి30(జనంసాక్షి): ఛాయ్‌వాళకు తేయాకు కార్మికుల సమస్యలు తెలియవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ  విమర్శలు చేశారు.అస్సాం రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా ప్రస్తుత అధికారంలో ఉన్న భాజాపా ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో అడ్డదారుల్లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చేయడాన్ని  ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకవేళ అసోంలో కనుక ఎన్నికలు లేకపోతే ఇక్కడి ప్రభుత్వాన్ని కూడా భాజాపా కూల్చేడానికి వెనుకాడబోదని ఆమె ఎద్దేవా చేశారు.అంతకు ముందు ఆమెకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ స్వాగతం పలికారు. అంగురి నియోజకవర్గం నుంచి అంకిత కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగురిలో ఏర్పాటు చేసిన ర్యాలీలో సోనియాగాంధీ పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం అస్సావిూ సంప్రదాయ టోపీని ఆమెకు బహుకరించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్‌ 4, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. మంగళవారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.