జనంసాక్షి కథనానికి స్పందించిన సీఎం

C

”పాతబస్తీని నిర్లక్ష్యం చేసిన పాలకులు

ముఖ్యమంత్రులు పర్యటించరు”

అన్న శీర్షికతో సోమవారం, మే18న జనంసాక్షి ప్రత్యేక కథనం

పాతబస్తీలో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌తో కలిసి గల్లీ గల్లీ కలియదిరిగిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): పాతబస్తీపై గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జనంసాక్షి ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనంసాక్షి మే 18న ”పాతబస్తీని నిర్లక్ష్యం చేసిన పాలకులు” అంటూ ప్రచురించిన కథనానికి స్పందించి తన పర్యటనను పాతబస్తీకి మార్చారు. పాతబస్తీలో పర్యటించిన ఆయన అక్కడి స్థానికులనడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయటానికి తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందన్నారు.  పాతబస్తీని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. డబీర్‌పురాలో స్వచ్ఛహైదరాబాద్‌ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. అనంతరం సీఎం స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1200 కోట్లతో డబీర్‌పురాలో జలాశయం నిర్మిస్తామని, ఈ జలాశయానికి హజ్రత్‌ అబ్బాస్‌ పేరు పెడుతామని పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్య ఉంటుందని దుష్ప్రచారం చేశారని, అయితే .ఆ సమస్యను ఇపుడు అధిగమించి చూపించామన్నారు. గంగాజమున తహజీబ్‌ లాగా తెలంగాణలో మైనార్టీల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. తెలంగాణ అభివృద్ది ఫలాలు అందరికీ అందాలని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల వరకు అధికారులు లేరని.. రెండు మూడు నెలల క్రితమే అధికారులను కేటాయించడంతో పాలన గాడిలో పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రి జగదీశ్‌ రెడ్డి,ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  పాల్గొన్నారు.  గంగా-జమున సంస్కృతికి పేరుగాంచిన చారిత్రక నగరమిదని,  హిందూ, ముస్లింల ఐక్యతతో ప్రపంచానికే ఈ నగరం ఆదర్శం కావాలన్నారు. త్వరలో పాతబస్తీలో ప్రత్యేకంగా 2,3 రోజులు పర్యటిస్తామని, ఏయే సమస్యలు ఉన్నాయో చూసి పరిష్కరిస్తామని చెప్పారు. పాత బస్తీలో మురికి కాల్వల సమస్య పరిష్కారానికి ఈరోజే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేదు… రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. పాతబస్తీలో మురికి కాలువల సమస్య పరిష్కరానికి ఇవాళే ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు.  పాతబస్తీ పర్యటనలో భాగంగా సీఎం సైదాబాద్‌ ఎర్రకుంటలోని స్మశానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎర్రకుంట చెరువును మిషన్‌కాకతీయలో చేర్చి పునరుద్దరిస్తమన్నారు. స్మశానాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2కోట్లు మంజూరు చేస్తమని హావిూనిచ్చారు. డబీర్‌పురాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీలో పర్యటించారు. ఇందులో భాగంగా డబీర్‌పురాలో స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎంతోపాటు స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలని ఆకాంక్షించారు. పాతబస్తీలో అభివృద్ధి జరుగాలని సీఎంను కోరారు.అలాగే  కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ ను సందర్శించారు. స్థానికులను, రైతులను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.  ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ తొలివిడత కార్యక్రమం బుధవారంతో  ముగియనుంది. హైదరాబాద్‌ నగరం బాగుపడేవరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వచ్ఛహైదరాబాద్‌లో భాగంగా ఎల్బీనగర్‌ పరిధిలో ఎన్టీఆర్‌ నగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ చెత్తపై సమరం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బస్తీవాసులకు సూచించారు. నగరంలో ఒక్క బస్తీ కూడా పరిశుభ్రంగా లేదని.. నగరం ఉండాల్సినంత అందంగా లేదన్నారు. స్వచ్ఛహైదరాబాద్‌ నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. చెత్త సేకరించి పారబోయడానికి ఆటో ట్రాలీలను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు. ఐదురోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతా కార్యక్రమంలో పాల్గొని చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వ్యక్తిగత సమస్యలు, కాలనీ అవసరాలు అదేవిధంగా దీర్ఘకాలంగా స్థానికంగా నెలకొన్న సమస్యలపై విజ్ఞాపణలు స్వీకరిస్తున్నారు. ఇక హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన స్వచ్ఛహైదరాబాద్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.