జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జనగామ (జనం సాక్షి) ఆగస్ట్3: జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించుచున్నామని జనగామ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ జనగామ జిల్లా విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ వారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ మా వంతుగా జనగమలోని కురుమవాడ బ్రహ్మంగారి భవనము నందు ఈ నెల 7 వ తేదీ ఆదివారం రోజున ఉదయం ఏడు గంటలకు ఆదిత్య ఆస్పటల్ డాక్టర్ ఆర్మీ కల్నల్ బిక్షపతి వారి సహకారంతో వైద్య శిబిరం నిర్వహించుచున్నాము అని , మన విశ్వబ్రాహ్మణులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని తెలిపినారు .ఈ కార్యక్రమంలో జనగామ స్వర్ణకార సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు తో పాటు ప్రధాన కార్యదర్శి పొన్నోజ్ రతన్ ఉపాధ్యక్షులు మారోజు ఆనంద్ కోశాధికారి జాజాల రత్నం సహాయ కార్యదర్శి మహేశ్వరం హరీష్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.