జమ్ముకశ్మీర్‌ ప్రజల ఆందోళనకు స్వామి సంఘీభావం

2

యాసిన్‌, స్వామిఅగ్నివేశ్‌ గృహ నిర్బంధం

శ్రీనగర్‌్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు, వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ తోపాటు ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ లను శ్రీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హురియత్‌ నేతలు గిలానీ, మిర్వేజ్‌ లను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మసరత్‌ ఆలం అరెస్ట్‌ కు నిరసనగా ఇవాళ రాష్ట్ర బంద్‌ కు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా వారిని నిర్బంధంలో ఉంచారు. మరోవైపు, బంద్‌ సందర్భంగా జమ్ముకాశ్మీర్‌ లో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాశ్మీరీ పండిట్లకు ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ వేర్పాటువాదులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ జరిపారు. శ్రీనగర్‌ లోని నార్బల్‌ ప్రాంతంలో నిరసనకారులు రెచ్చిపోవటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్ముకాశ్మీర్‌ లో పోలీసుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రతా బలగాల కాల్పులపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బలగాలు నిబంధనలను అతిక్రమించాయని అభిప్రాయపడింది.