జమ్మూకాశ్మీర్‌లో కొలువుదీరిన కొత్త సర్కార్‌

3

మార్చి1(జనంసాక్షి): జమ్మూ కాశ్మీర్‌ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్‌ సింగ్‌ ప్రమాణం చేశారు. మొత్తం 25 మందితో కాశ్మీర్‌ కేబినెట్‌ కొలువుదీరింది. జమ్మూ యూనివర్సిటీలోని జనరల్‌ జోరావర్‌ సింగ్‌ఆడిటోరియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి తదితరులు హాజరయ్యారు