జయ కేసు తీర్పు నేడే

04

బెంగళూరు మే 4 (జనంసాక్షి):

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై కర్నాటక హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై కర్నాటక హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో సత్వరం తీర్పు చెప్పాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు విధించిన మూడు నెలల గడువు పూర్తి కావడానికి సరిగ్గా ఒక రోజు ముందు కర్నాటక హైకోర్టు తన తీర్పు వెలువరించనుంది. అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు గత ఏడాది సెప్టెంబర్‌ 27న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.