జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

2

– ఢిల్లీలో సమాచార శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌

ఢిల్లీ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): రెండు రోజుల పాటు ఢిల్లీ లోని విజ్నాన్‌ భవన్‌ లో జరిగిన సివిల్‌ సర్వీస్‌ డే సదస్సు లో తెలంగాణా సమాచార పౌరసంబధాల కవిూషనర్‌ నవీన్‌ మిట్టల్‌ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ లోని తెలంగాణా సమాచార కేంద్రాన్ని సందర్శించి, విలేఖరులతో కాసేపు మచ్చటించారు. ఈ సందర్భంగా సమాచార కేంద్రంలో సమస్యలు, తెలంగాణా జర్నలిస్టుల సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయవల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. సమాచార కేంద్రంలో విూడియా ప్రతినిధుల సౌలభ్యంలోసం మరిన్ని మౌళిక వసతులు కల్పిస్తామని హావిూఇచ్చారు. పాత్రికేయుల హెల్త్‌ కార్డుల సమస్యలను త్వరగా అధిగమించడానికి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తామని సూచించారు. ఢిల్లీ జర్నలిస్టులు తెలంగాణా ప్రభత్వం ఇచ్చిన హెల్త్‌ కార్డులను దేశ రాజధానిలో ఏదో ఒక హాస్పిటల్‌ లో వినియోగించుకునేందుకు చర్యలు చేపడతామన్నారు. ఢిల్లీ తెలంగాణా భవన్‌ లో పనిచేసే ఉద్యోగులు ఎక్కడైతే తమ వైద్యసేవలు వినియోగించుకుంటారో, ఆ హాస్పిటల్‌ లోనే పాత్రికేయులు కూడా తమ హెల్త్‌ కార్డులను వినియోగించుకునేలా పరిశీలిస్తామన్నారు తెలంగాణా సమాచార, పౌరసంబంధాల కవిూషనర్‌ నవీన్‌ మిట్టల్‌.

విూడియా కోఆర్డినేటర్‌,న్యూఢిల్లీ సమాచర కేంద్రంచే జారీ చేయబడినది.