జల్లి వివో సంఘంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న కాట విమల కుమారస్వామి.

పట్టించుకోని జిల్లా మండలాధికారులు.

జనం సాక్షి,చెన్నరావు పేట

జల్లి వివో సంఘంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న పట్టించుకోని జిల్లా మండలాధికారులు అని
కాట విమల కుమారస్వామి వాపోయారు. మండల కేంద్రము లో మీడియా ప్రతినిధుల తో వారు మాట్లాడుతూ 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం 54 రోజులైనా ఎందుకు ఇవ్వడం లేదని,జల్లి వివో లోనే ఇంత దోపిడీ జరిగితే మండలం మొత్తం ఎంత అవినీతి జరిగింది విచారణ చేపట్టాలనీ కాటా విమల కుమారస్వామి డిమాండ్ చేశారు.చెన్నారావుపేట మండలం జల్లి గ్రామ కాట విమల కుమారస్వామి తేదీ 28 6 2022 నుండి ఇప్పటివరకు మహిళా సంఘం మీద జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేయడం జరుగుతుంది .జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు అందువల్ల 28 9 2022 సమాచారం హక్కు చట్టం 2005 ప్రకారం ఎంపీడీవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సింది కానీ 54 రోజులు అవుతున్నప్పటికీ సమాచారం లేదు. సెక్షన్ 19(1) ప్రకారం 45 రోజులు గడిచిన తర్వాత వారిపై చట్టపరమైన నేరం తీసుకోవాలి ఎంపీడీవో ఆదేశంసారం జల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.21/10/2022 నాడు చెన్నారావుపేట ఏపిఎం ఈశ్వరయ్య, సీ సీ వెంకట్, శ్రీనిధి సరిత మండలంలో ఉన్న అన్ని గ్రామాల సిఎలు ఐక్యతతో వారు అందరూ కలిసి రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు అన్ని సంఘాల లీడర్లు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో ముఖ్యంశాలు ఒక సభ్యురాలు 600 చొప్పున కట్టిన రూపాయలు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అట్టి రూపాయలకు వ్యవసాయ పనిముట్లు, రోటవేటర్, పవర్ లీడర్, పంపులు ఇతర సామాన్ల పనిముట్లు వాటికి వచ్చిన కిరాయికి ఇచ్చిన ఆదాయం 5300 రోడ్వేటర్ కిరాయి రెండు సంవత్సరాలు కిరాయి 6000 మొత్తం 11,300 ఇలా మహిళా సంఘం ఆదాయం ఖర్చు చేశారు. అదే కాకుండా గ్రామాలలో బ్యాంకు రుణాలు వాళ్ల ఇష్టారాజ్యంగా పంపకాలు చేస్తున్నారు.సభ్యులకు తెలియకుండా సిఎకి నచ్చిన వారికి ఇప్పియడం జరుగుతుంది. పది రోజుల కింద జరుగుతున్న లెక్కలు గత సంవత్సర లెక్కల బుక్కులో రాయడం, ఇలాంటి విషయాలు గ్రామంలో ప్రజలు ప్రశ్నించినప్పుడు కొందరు మహిళలు ఎదురు దిగడం జరుగుతుంది.ఇది చూస్తున్న జిల్లా అధికారులు మండల అధికారులు వారిని తొలగించకుండా సీఎలు అందరు కలిసి వారికి సపోర్టు మద్దతు పలుకుతున్నారు. జల్లి గ్రామంలో ఇంత అవినీతి జరిగితే మండలం మొత్తం ఎంత ఖర్చు చేశారు. ఎంత కిరాయితో సంపాదించారు.అని ఆర్టిఏ వేయాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా అన్ని పార్టీల మండల అధ్యక్షులకు నా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా బీసీ సంఘాల మండల నాయకులు ఎస్టీ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అందరి మద్దతుతో చెన్నారావుపేటలో ధర్నా చేయాల్సిందిగా తప్పుచేసిన ఏపీఎం ను ,సిఎలను ఎవరైనా వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని దానికి మీ అందరి మద్దతు తోడుకు అవసరం ఇలా జరగకపోతే హైకోర్టు నుంచి, మండలం పై కలెక్టర్ కి స్టే పంపిస్తే వారు ఇంటింటి సర్వే చేసి శ్రీనిధి ఈవో బ్యాంకు అప్పులు అన్ని సర్వే చేసి దోషులను చట్ట పరమైన శిక్షలు వేసి వారి నుండి సొమ్ము రికవర్ చేసి వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు.మహిళలు కొందరు అవగాహన లేక దాడికి దిగుతున్నారని వాపోయారు.