జాతి గర్వించదగ్గ నేత బాపు జగ్జీవన్‌రాం

5

– స్టాండప్‌ ఇండియా పథాకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

నోయిడా,ఏప్రిల్‌ 5(జనంసాక్షి):బాబూ జగ్జీవన్‌రామ్‌ దేశం గర్వించదగ్గ నేతని… ఆయన జయంతి రోజున స్టాండప్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. నోయిడాలో ‘స్టాండప్‌ ఇండియా’ పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ…దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించేందుకే ‘స్టాండప్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పతి భారతీయుడు తన సొంత కాళ్లపై నిలబడేలా చేయాలన్నదే స్టాండప్‌ ఇండియా ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్టీ, ఎస్టీ, మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. యువకులు ఉద్యోగం కోసం తిరగకుండా… వారే ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరుకోవాలని సూచించారు. దళితులు, పేదలకు అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనే సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు స్టాండప్‌ ఇండియా ద్వారా చేయూత కల్పిస్తామని ప్రధాని హావిూ ఇచ్చారు.దళితులు, ఆదివాసీలు, మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ముద్రా యోజన స్కీమ్‌ కింద పలువురుకి ఈ-రిక్షాలు పంపిణీ చేశారు.సమాజంలో అందరికంటే వెనుకబడిన వ్యక్తులు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వారు ఎవరి దయతోనో బ్రతకాల్సిన అవసరం రాకూడదని, ఇదే ఆలోచనతో స్టాండప్‌ ఇండియా రూపకల్పన జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణసహాయం అందుతుందని ఆయన అన్నారు.బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. స్టాండప్‌ ఇండియా ద్వారా దళితులు, ఆదివాసీలు, మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడతారని, మరికొందరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరుకుంటారన్నారు. దేశంలోని అన్ని బ్యాంకులు తమ ప్రతీ బ్రాంచ్‌ పరిధిలో ఒక దళితుడు లేదా ఆదివాసీకి, ఒక మహిళకు రుణం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ముద్రా బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. కొన్నిసార్లు చిన్న వ్యాపారులు సైతం రుణాల కోసం ప్రయాస పడాల్సి వస్తోందని? ఇలాంటి తరుణంలో స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని జైట్లీ స్పష్టం చేశారు.