జాతీయ సంఘాలతో…
గోదావరిఖని, జూన్ 12, (జనంసాక్షి): జాతీయ సంఘాల వల్లనే వర్క్‌షాప్ కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్య క్షులు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. మంగళ వారం ఆర్జీ-1 ఏరియా వర్క్‌షాప్‌పై గేట్‌మీటిం గ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడు తూ… వివిధ ఏరియాల్లో పనిచేసే వర్క్‌షాప్ కార్మికులను ప్రైవేటీకరణ చేశారు. కొన్ని చోట్ల కార్మికుల సంఖ్యను కుదించడానికి కారణం జాతీ య సంఘాలదేనని ఆయన ఎద్దేవా చేశారు. వార సత్వ ఉద్యోగాలు పోగొట్టిన ఘనత జాతీయసం ఘాలదేనన్నారు. ఇవన్నీ చేసిన జాతీయ సంఘా లు ఇప్పుడు కార్మికులను ఓట్లను సిగ్గు లేకుండా ఓట్లను అడగడానికి వస్తున్నాయని, ఈ సంఘా లను కార్మికులు నమ్మరని ఆయన అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టిబిజికేఎస్‌ను గెలిపిస్తే… కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడు తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకులు రాజిరెడ్డి, రాజమౌళి, శ్యాంసన్, రాంచందర్, గద్ద కుమారస్వామి, ఆరెల్లి పోశం, ప్యారేమియా, భాస్కర్‌రెడ్డి, బేబి శ్రీనివాస్, కుంట కొమురయ్య, రాంచందర్, రామస్వామి, జనగామ శ్రీనివాస్, సంతోష్, అంతయ్య, చంద్ర య్య, దత్తరావు, వెంకటయ్య, వెంకటగౌడ్, రాజ య్య, రాయమల్లు, గుంపుల ఓదేలు, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.