జాఫ్నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ, మార్చి6(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మారోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ దఫా ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు 10న ఢిల్లీ నుంచి బయలు దేరనున్న ఆయన సీషెల్స్, మారిషస్, శ్రీలంకలో పర్యటించనున్నట్లు విదేశాంగ వ్యవహారాలశాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. మార్చి 11న ఆయన సీషెల్స్‌లో అక్కడి అధ్యక్షుడు జేమ్స్ అలెక్సిస్ మైఖెల్తో ద్వైపాక్షిక సంబంధాలు చర్చిస్తారు. అనంతరం అదే 11, 12న మారిషస్, 13, 14న శ్రీలంకలో ఆయన పర్యటించి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ఇతర సీనియర్ నేతలతో భేటీ అవుతారు. లంక పర్యటనలో ప్రధాని మోదీ ఎల్‌టీటీఈ తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతం జాఫ్నాలో కూడా పర్యటించనున్నారు.