జిమ్నాస్ట్‌ అరుణరెడ్డితో శాప్‌ ఛైర్మన్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణకు చెందిన జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్ధ అరుణరెడ్డిని హర్యానా రాష్ట్రంలోని అంబాలలో గల వార్‌ హీరోస్‌ మెమోరియల్‌ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి కలిశారు. జపాన్‌లో వచ్చే నెల అక్టోబర్‌ 18 వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌ లో టోర్నమెంట్‌ పోటీల్లో పాల్గొనడానికి ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు గల ఇండియన్‌ టీం లో వచ్చే నెల అక్టోబర్‌ 12 వ తేదీన జపాన్‌ కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ బుద్ధ అరుణ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. బుద్దా అరుణ రెడ్డి గతంలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ లో మెడల్‌ సాధిస్తే తెలంగాణ సిఎం కెసిఆర్‌ రెండు కోట్ల ఆర్థిక సహాయం చేశారని ఈ సందర్భంగా ఛైర్మన్‌ తెలిపారు. మళ్లీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ కి ఎంపిక కావడం తెలంగాణకు గర్వ కారణం అని, రానున్న రోజుల్లో ఏషియన్‌
గేమ్స్‌ కి, కామన్వెల్త్‌ గేమ్స్‌ కి, ఒలింపిక్‌ గేమ్స్‌ కి ఎంపిక అయి మెడల్‌ సాధించే ఆస్కారం ఉంది అని ఛైర్మన్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మనోజ్‌ రాణా, సత్‌ పాల్‌ చబ్రూ, పారమౌర్‌ సింగ్‌, శ్రీమతి.అంజు దువా తదితరులు క్రీడాకారులు పాల్గొన్నారు.