జిల్లాలో 15,175 మందికి ఉపాధి

శ్రీకాకుళం, జూలై 5: డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జిల్లాలో 15,175 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిఆర్‌డిఎ ఎపిడి పి.కోటేశ్వరరావు తెలిపారు. ఎచ్చెర్లలో మహిళా ప్రగతి కేంద్రంలో శిక్షణా సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 21 శిక్షణాకేంద్రాలను ప్రారంభించామని, వీటిలో టెక్స్‌టైల్స్‌, కంప్యూటర్‌, మార్కెటింగ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రికల్‌ వంటి 16 విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అనసరించవలసిన విధానాలపై సంబంధిత అధికారులతో ప్రాణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాబ్స్‌ మేనేజర్‌  రాజకుమార్‌, ఎపిఎం రజని తదితరులు పాల్గొన్నారు.